IPL 2022 QUALIFIER 2 RR VS RCB LIVE SCORE UPDATES RAJASTHAN ROYALS WON BY 7 WICKETS AND JOS BUTTLER HITS ANOTHER SUPER KNOCK SRD
IPL 2022 Qualifier 2 : పేరు గుర్తుందిగా బట్లర్.. మరో సునామీ ఇన్నింగ్స్.. ఆర్ఆర్ ఫైనల్ కు.. ఆర్సీబీ ఇంటికి..
Jos Buttler
IPL 2022 Qualifier 2 : ఈ మ్యాచులో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. సీజన్లు మారినా.. కెప్టెన్లు ఛేంజ్ అయినా ఆర్సీబీ దరిద్రం మాత్రం పోవడం లేదు. మళ్లీ వచ్చే ఏడాది ఈ సాలా నమదే కప్ అనుకోవడమే.
ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్ అడుగుపెట్టింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది సంజూ శాంసన్ సేన. జాస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో 158 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో అందుకుంది రాజస్థాన్. దీంతో.. ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. జోస్ బట్లర్ ( 60 బంతుల్లో 106 పరుగులు నాటౌట్ ; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో సారి తన ఫామ్ కంటిన్యూ చేస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్ లో బట్లర్ కి ఇది నాలుగో సెంచరీ. సంజూ శాంసన్ (21 బంతుల్లో 23 పరుగులు), యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో 21 పరుగులు) బట్లర్ కి సహకరించారు. ఇక, ఈ మ్యాచులో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. సీజన్లు మారినా.. కెప్టెన్లు ఛేంజ్ అయినా ఆర్సీబీ దరిద్రం మాత్రం పోవడం లేదు. కోహ్లీ, మ్యాక్సీ, డుప్లెసిస్, కార్తీక్ వంటి స్టార్ ప్లేయర్లు కీలక మ్యాచులో చేతులేత్తయడం ఆర్సీబీ పరాజయానికి ముఖ్య కారణం. ఆర్సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. హసరంగ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ కి ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. జైస్వాల్ ఫస్ట్ ఓవర్ లోనే 16 పరుగులు చేసి.. మంచి బూస్ట్ ఇస్తే.. బట్లర్ తన ఫామ్ కంటిన్యూ చేశాడు. బౌలర్ ఎవరైన సరే తగ్గేదేలే అన్నట్టు సాగింది రాజస్తాన్ బ్యాటింగ్. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు ధనాధన్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హజెల్ వుడ్ విడదీశాడు. 13 బంతుల్లో 21 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్ కోల్పోయినా.. రాజస్థాన్ తమ దూకుడు మాత్రం ఆపలేదు. జోస్ బట్లర్ తో కలిసిన సంజూ శాంసన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
మరో ఎండ్ లో బట్లర్ తన బ్యాటింగ్ జోరును ఆపలేదు. బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సంజూతో కూడా 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు బట్లర్. అయితే.. 23 పరుగులు చేసిన సంజూ హసరంగ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. అయితే.. ఈ వికెట్ తర్వాత స్కోరు వేగం తగ్గినా.. ఆఖర్లో బట్లర్ తన జోరు చూపించడంతో ఆర్ఆర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 59 బంతుల్లో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో, సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టింది.
అంతకుముందు ప్రసిద్ధ్, మెకాయ్ సూపర్ బౌలింగ్ తో ఆర్సీబీ సాధారణ స్కోరుకు పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (42 బంతుల్లో 58 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (13 బంతుల్లో 24 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, మెకాయ్ చెరో మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు. అశ్విన్, బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.