IPL 2022 Qualifier 1: మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నాయి. మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడబోతోంది లక్నో సూపర్ జెయింట్స్. రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టుతో, మొదటి క్వాలిఫైయర్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు ఒకరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే.. నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangaore) మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఆధారపడాల్సి వచ్చింది. మే 24న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. అయితే, ఈ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్.
కోల్‌కతాలో జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు భారీ వర్షం పొంచివుంది. ఈ మ్యాచ్ వర్షార్పణం కావడానికే అధిక అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన కోల్‌కతలో మంగళవారం నాడు భారీ వర్షం పడుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కోల్‌కతాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
గత రెండు రోజులుగా కోల్‌కతలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. బలమైన ఈదురుగాలులు వీచాయి. వర్షం ఎఫెక్ట్ కు తొలి క్వాలిఫయర్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఈడెన్ గార్డెన్స్ తడిచి ముద్దయింది. ప్రెస్ బాక్స్ అద్దాలు ఊడి పడ్డాయి. ఈ బాక్స్ మొత్తం ధ్వంసమైంది. వర్షం నిలిచిన తర్వాత బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ.. ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించారు. మరో 48 గంటల్లో క్వాలిఫయర్ 1 ఆరంభం కావాల్సి ఉన్నందున గ్రౌండ్‌ను సిద్ధం చేయడానికి అవసరమైన సూచనలు జారీ చేశారు.
ఈడెన్ గార్డెన్స్ లోని గ్రౌండ్ స్టాఫ్ తో మాట్లాడుతున్న గంగూలీ
ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా నీళ్లపాలు కాలేదు. వర్షం వల్ల రద్దు కావడం గానీ, ఓవర్లను కుదించడం గానీ జరగలేదు. ఈ సారి మాత్రం కోల్‌కతకు సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున దాని ప్రభావం కాస్తా క్వాలిఫయర్ 1 మీద పడుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇక, మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నాయి. మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడబోతోంది లక్నో సూపర్ జెయింట్స్. రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టుతో, మొదటి క్వాలిఫైయర్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోతున్నాయి. ఈ రెండు మ్యాచులు ముగిసిన తర్వాత రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ తరలివెళ్తాయి మూడు జట్లు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.