Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది.
Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ డెత్ ఓవర్లలో మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. దయాల్ వేసిన బౌలింగ్ లో జాస్ బట్లర్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ కు మధ్యలో తగలకపోవడంతో మిడాన్ లో గాల్లోకి లేచింది. అక్కడే పాండ్యా ఉండటంతో బట్లర్ అవుట్ కాక తప్పదని అంతా అనుకున్నారు. అయితే గాల్లోకి లేచిన బంతిని అందుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా ఊహించని విధంగా కింద పడ్డాడు. గత మూడు రోజులుగా ఈడెన్ గార్డెన్ లో వర్షం పడటంతో.. బౌండరీ లైన్ దగ్గర అవుట్ ఫీల్డ్ కాస్త చిత్తడిగా ఉంది. దాంతో స్లిప్ అయిన పాండ్యా కింద పడిపోయాడు. అతడు పడిన తీరుకు మరోసారి గాయం కాక తప్పదు అని అంతా అనుకన్నారు. అయితే లక్కీగా పాండ్యా వెంటనే లేచి నవ్వుతూ తన ఆటను కొనసాగించాడు.
పాండ్యాకు గతంలో వెన్నెముక సర్జరీ జరగిన సంగతి తెలిసందే. ఆ గాయంతోనే దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. ఇక 2021 ఐపీఎల్, టి20 ప్రపంచకప్ లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా ఐపీఎల్ లో అదరగొట్టి మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్తాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో ఫైనల్ కు చేరుకుంది. క్వాలిఫయర్ 1లో ఓడిన రాజస్తాన్ రాయల్స్.. క్వాలిఫయర్ 2 కోసం ఎదురుచూస్తోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (53 బంతుల్లో 86; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. కెప్టెన్ సంజూ సామ్సన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), పడిక్కల్ (28) కూడా రాణించడంతో రాజస్తాన్ భారీ స్కోరును అందుకుంది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ను డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ షోతో అలరించాడు. ఆఖరి ఓవర్లలో రాజస్తాన్ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో.. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన డేవిడ్ మిల్లర్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ను ఫైనల్స్ లో నిలిపాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.