హోమ్ /వార్తలు /క్రీడలు /

GT vs RR : క్వాలిఫయర్ 1లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. స్టార్ పేసర్ ను పక్కన పెట్టిన గుజరాత్..

GT vs RR : క్వాలిఫయర్ 1లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. స్టార్ పేసర్ ను పక్కన పెట్టిన గుజరాత్..

హార్దిక్ పాండ్యా వర్సెస్ సంజూ సామ్సన్ (PC : IPL)

హార్దిక్ పాండ్యా వర్సెస్ సంజూ సామ్సన్ (PC : IPL)

GT vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య క్వాలిఫయర్ 1 పోరు జరగనుంది. కోల్ కతా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంటుందని అంతా భావించారు.

ఇంకా చదవండి ...

GT vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య క్వాలిఫయర్ 1 పోరు జరగనుంది. కోల్ కతా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంటుందని అంతా భావించారు. మ్యాచ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు తలెత్తాయి. అయితే వర్షం తెరిపినివ్వడంతో టాస్ ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా జరిగింది. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik pandya) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఒక మార్పు చేసింది. పేసర్ లూకీ ఫెర్గూసన్ ను పక్కన పెట్టిన ఆ జట్టు అల్జారీ జోసెఫ్ కు తుది జట్టులో చోటు ఇచ్చింది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్ కోసం ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది.

గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌ లు ఆడిన గుజరాత్‌.. పదింట్లో గెలిచింది. అటు రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం తొమ్మిది మ్యాచుల్లో విజయంసాధించింది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది.  గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలవడానికి ప్రధాన కారణం ఆల్‌ రౌండ్‌ పర్ఫామెన్స్‌. హార్ధిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌, డేవిడ్‌ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్‌ లతో గుజరాత్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్‌ లోనూ గుజరాత్‌ దుమ్మురేపుతోంది. మహ్మద్‌ షమీ, లూకీ ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌ ఆ జట్టుకు పెద్ద అసెట్‌ అని చెప్పుకోవచ్చు.టాపార్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది.

ఆ జట్టులో టాప్‌ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ పాండ్యా 413 పరుగులతో 11వ స్థానంలో నిలిచాడు. 403 రన్స్‌తో శుభ్‌మన్‌ గిల్ 13వ స్థానంలో నిలిచాడు. గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్‌ హిట్టర్లు.. స్ట్రోక్‌ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. ఇక, ఇప్పటివరకు రషీద్‌ ఖాన్‌ ఆడిన 14 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. షమీ సైతం18 వికెట్లు పడగొట్టాడు.

ఇక రాజస్థాన్‌ జట్టుకు జోస్‌ బట్లర్‌ కీ ప్లేయర్‌ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 మ్యాచ్‌ లు ఆడిన బట్లర్‌ 629 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతానికి బట్లర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ గా కూడా ఉన్నాడు. ఇక యశస్వీ జైశ్వాల్‌, కెప్టెన్‌ సంజూ సాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, హెట్‌ మెయిర్‌, రియాన్‌ పరాగ్‌ లతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఫుల్‌ స్ట్రాంగ్‌ గా కనిపిస్తోంది.


తుది జట్లు

రాజస్తాన్ రాయల్స్

జాస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ సామ్సన్ (కెప్టెన్), పడిక్కల్, షిమ్రన్ హెట్ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిధ్, ఒబెడ్ మెకాయ్.

గుజరాత్ టైటాన్స్

సాహా, శుబ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మ్యాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, యశ్ దయాల్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, మొహమ్మద్ షమీ,

First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mohammed Shami, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు