IPL 2022 QUALIFIER 1 GT VS RR LIVE SCORES JOS BUTTLER SUPER BATTING HELPS RAJASTHAN ROYALS TO PUT MASSIVE TARGET FOR GUJARAT TITANS SJN
GT vs RR : గంగూలీ ఇలాకాలో బట్లర్ ప్రభంజనం.. గుజరాత్ పై బౌండరీల వర్షం.. టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
జాస్ బట్లర్ (PC : IPL)
GT vs RR : గత మూడు మ్యాచ్ ల్లో పెద్దగా పరుగులు సాధించలేకపోయిన రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) సరైన సమయంలో రెచ్చిపోయాడు.
GT vs RR : గత మూడు మ్యాచ్ ల్లో పెద్దగా పరుగులు సాధించలేకపోయిన రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) సరైన సమయంలో రెచ్చిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా కోల్ కతా వేదికగా జరుగుతోన్న క్వాలిఫయర్ 1 పోరులో రెచ్చిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో బట్లర్ (53 బంతుల్లో 86; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వన్ మ్యాన్ షోతో అలరించాడు. దాంతో రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. బట్లర్ కు తోడు కెప్టెన్ సంజూ సామ్సన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), పడిక్కల్ (28) కూడా రాణించడంతో రాజస్తాన్ భారీ స్కోరును అందుకుంది.
టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందనే కారణంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ లో చెప్పాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలోనే డాషింగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (3) వికెట్ ను కోల్పోయింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ సంజూ సామ్సన్ వచ్చీ రావడంతోనే రెచ్చిపోయాడు. దాదాపు 200 స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో ఉన్న బట్లర్ మాత్రం ఆరంభంలో తడబడ్డాడు. 100 కంటే తక్కువ స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అర్ధ సెంచరీకి చేరువైన సామ్సన్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ కూడా ఉన్నంత సేపు బాగానే ఆడాడు. రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే పడిక్కల్ ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. పడిక్కల్ అవుటయ్యాక బట్లర్ విధ్వంసం మొదలైంది. అంతసేపు తడబడిన అతడు ఒక్కసారిగా ఆకలి గొన్న పులిలా రెచ్చిపోయాడు. అదే సమయంలో గుజరాత్ పేలవ ఫీల్డింగ్ వల్ల అవుటయ్యే ప్రమాదం నుంచి పలుమార్లు తప్పించుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న హార్దిక్ ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. దాంతో రాజస్తాన్ భారీ స్కోరును సాధించగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.