హోమ్ /వార్తలు /క్రీడలు /

GT vs RR : రాజస్తాన్ కొంప ముంచిన రూ. 10 కోట్ల ప్లేయర్.. కిల్లర్ మిల్లర్ విధ్వంసం ముందు కొట్టుకుపోయిన బట్లర్ ఇన్నింగ్స్

GT vs RR : రాజస్తాన్ కొంప ముంచిన రూ. 10 కోట్ల ప్లేయర్.. కిల్లర్ మిల్లర్ విధ్వంసం ముందు కొట్టుకుపోయిన బట్లర్ ఇన్నింగ్స్

డేవిడ్ మిల్లర్ (PC : IPL)

డేవిడ్ మిల్లర్ (PC : IPL)

GT vs RR : కిల్లర్ మిల్లర్ (David Miller) మరోసారి రెచ్చిపోయాడు. జట్టుకు అవసరం అయిన సమయంలో నేనున్నానంటూ సూపర్ ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ను ఒంటిచేత్తో గెలిపించాడు.

GT vs RR : కిల్లర్ మిల్లర్ (David Miller) మరోసారి రెచ్చిపోయాడు. జట్టుకు అవసరం అయిన సమయంలో నేనున్నానంటూ సూపర్ ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ను ఒంటిచేత్తో గెలిపించాడు. కోల్ కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ లో జరిగిన తొలి క్వాలిఫయర్  మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)పై ఘనవిజయం సాధించింది. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ () 2022 సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధంచిన తొలి జట్టుగా నిలిచింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ను డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ షోతో అలరించాడు. ఆఖరి ఓవర్లలో రాజస్తాన్ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో.. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన డేవిడ్ మిల్లర్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ను ఫైనల్స్ లో నిలిపాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.

భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. బౌల్ట్ వేసిన ఇన్నిగ్స్ మొదటి బంతికే సాహా (0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అయితే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన మ్యాథ్యూ వేడ్ (35), మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ (35) గుజరాత్ ను ఆదుకున్నారు. సమయోచితంగా ఆడుతూ గుజరాత్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. అయితే కీలక సమయంలో సమన్వయ లోపంతో గిల్ రనౌట్ అయ్యాడు. మరికాసేపటికే భారీ షాట్ కు ప్రయత్నించిన వేడ్ క్యాచ్ అవుటయ్యాడు. దాంతో గుజరాత్ మరోసారి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. అయితే ఈ సమయంలో జతకలిసిన మిల్లర్, హార్దిక్ పాండ్యా ఎటువంటి తడబాటుకు గురి కాకుండా ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూ గతి తప్పిన వాటిని బౌండరీలకు తరలించారు. అయితే 19వ ఓవర్ ను మెకాయ్ అద్బుతంగా వేయడంతో.. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ప్రసిధ్ వేసిన తొలి మూడు బంతులను మూడు సిక్సర్లుగా మలిచిన మిల్లర్ మ్యాచ్ ను ఘనంగా ముగించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (53 బంతుల్లో 86; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. కెప్టెన్ సంజూ సామ్సన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), పడిక్కల్ (28) కూడా రాణించడంతో రాజస్తాన్ భారీ స్కోరును అందుకుంది.

First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mohammed Shami, Rajasthan Royals, Rashid Khan, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు