IPL 2022 QUALIFIER 1 GT VS RR LIVE SCORE UPDATES PREVIEW HEAD TO HEAD RECORDS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SRD
IPL 2022 Qualifier 1 - GT vs RR : ఫైనల్ టికెట్ ఎవరికో.. రెండు జట్ల బలబలాలు.. తుది జట్లు ఇవే..!
IPL 2022 Qualifier 1 - GT vs RR
IPL 2022 Qualifier 1 - GT vs RR : గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 14 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. పదింట్లో గెలిచింది. అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం తొమ్మిది మ్యాచుల్లో విజయంసాధించింది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
ఐపీఎల్ 2022(IPL 2022) చివరి ఘట్టానికి చేరుకుంది. మార్చి 26న ప్రారంభమైన లీగ్ మే 29తో ముగియనుంది. ఇప్పటివరకు జరిగిన 70 లీగ్ మ్యాచుల్లో పది జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇవాళ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అమీతుమీ తేల్చుకోనుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లనుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో పోటీ పడనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 14 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. పదింట్లో గెలిచింది. అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం తొమ్మిది మ్యాచుల్లో విజయంసాధించింది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలవడానికి ప్రధాన కారణం ఆల్ రౌండ్ పర్ఫామెన్స్. హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్ లతో గుజరాత్ బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్ లోనూ గుజరాత్ దుమ్మురేపుతోంది. మహ్మద్ షమీ, లూకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్ ఆ జట్టుకు పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు.టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది.
ఆ జట్టులో టాప్ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్యా 413 పరుగులతో 11వ స్థానంలో నిలిచాడు. 403 రన్స్‌తో శుభ్‌మన్ గిల్ 13వ స్థానంలో నిలిచాడు. గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ హిట్టర్లు.. స్ట్రోక్ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. ఇక, ఇప్పటివరకు రషీద్ ఖాన్ ఆడిన 14 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. షమీ సైతం18 వికెట్లు పడగొట్టాడు.
ఇక రాజస్థాన్ జట్టుకు జోస్ బట్లర్ కీ ప్లేయర్ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 మ్యాచ్ లు ఆడిన బట్లర్ 629 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతానికి బట్లర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ఉన్నాడు. ఇక యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ సంజూ సాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్ మెయిర్, రియాన్ పరాగ్ లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.
అటు బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ అదరగొడుతోంది. రాజస్థాన్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (26) సీజన్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. స్పిన్నర్ అదరగొడుతున్నాడు. 14 మ్యాచులు ఆడిన చాహల్ 26 వికెట్లు తీసి ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో అశ్విన్ పరుగులు నియంత్రిస్తూ ప్రత్యర్ధుల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
లీగ్ స్టేజ్‌లో గుజరాతే గెలిచింది: ఈ సీజన్లో లీగ్ స్టేజ్‌లో గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. అది గుజరాతే గెలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (87 నాటౌట్; 52 బంతుల్లో 8x4, 4x6) రెచ్చిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.