IPL 2022: జాంటీ రోడ్స్ చేసిన పనికి షాక్ అయిన సచిన్.. ఏకంగా సచిన్ కాళ్లపై...
జాంటీ రాడ్స్, సచిన్ (TWITTER)
IPL 2022: ’క్రికెట్ ఒక మతం అయితే దానికి గాడ్ సచిన్ టెండూల్కర్‘ అనేది భారతీయుల నినాదం. అవును నిజమే.. క్రికెట్ కు అంతలా ఆదరణ వచ్చిందంటే దానికి కారణం సచిన్ టెండూల్కరే. ఆటతో పాటు గొప్ప వ్యక్తిత్వంతో దేశం అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరి చేత క్రికెట్ దేవుడు అని అనిపించుకోవడంలో సచిన్ టెండూల్కర్ )Sachin Tendulkar) సక్సెస్ అయ్యాడు.
IPL 2022: ’క్రికెట్ ఒక మతం అయితే దానికి గాడ్ సచిన్ టెండూల్కర్‘ అనేది భారతీయుల నినాదం. అవును నిజమే.. క్రికెట్ కు అంతలా ఆదరణ వచ్చిందంటే దానికి కారణం సచిన్ టెండూల్కరే. ఆటతో పాటు గొప్ప వ్యక్తిత్వంతో దేశం అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరి చేత క్రికెట్ దేవుడు అని అనిపించుకోవడంలో సచిన్ టెండూల్కర్ )Sachin Tendulkar) సక్సెస్ అయ్యాడు. యువరాజ్ సింగ్ (Yuvraj Singh) లాంటి క్రికెటర్లు అయితే వీలు చిక్కినప్పుడల్లా అతడి కాళ్లకు మొక్కుతూ సచిన్ పట్ల తన విధేయతను చూపుతూ ఉంటాడు. తాజాగా ఇటువంటి సంఘటనే మరోసారి చోటు చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తలపడింది.
అయితే ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ ఓటమిని చవిచూసింది. అయితే మ్యాచ్ అనంతరం ఒక జట్టు సభ్యులతో మరో జట్టు సభ్యులు కరచాలనం చేసుకుంటున్న సమయంలో జరిగిన ఊహించని సంఘటన అందరిని షాక్ లో ఉండేలా చేసింది. ఒక టీం సభ్యులు మరొక టీం సభ్యులతో షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో సచిన్ టెండూల్కర్ పాదాలను పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తాకే ప్రయత్నం చేశాడు. పంజాబ్ ఆటగాళ్లతో సచిన్ కరచాలనం చేస్తుండగా... జాంటీ రోడ్స్ సడెన్ గా సచిన్ కాళ్లను తాకాడు. ఊహించని ఈ షాక్ నుంచి వెంటనే తేరుకున్న సచిన్... అతడిని వారించే ప్రయత్నం చేశాడు. అయినా సచిన్ కాళ్లను జాంటీ తాకాడు. వెంటనే అతడిని సచిన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వాస్తవానికి జాంటీ రోడ్స్ సచిన్ కంటే కూడా నాలుగేళ్లు పెద్ద. అయినప్పటికీ అతడు సచిన్ కాళ్లపై పడటం అందరీలోనూ ఆశ్యర్యాన్ని కలుగు చేస్తోంది. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే ఒక లెజండ్ కాళ్లను ఇంకో లెజెండ్ తాకిన వేళ అంటూ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో తమ ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లోనూ ఓడిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. రోహిత్, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ లతో పాటు జస్ప్రీత్ బుమ్రాలాంటి హేమా హేమీలతో ఉన్న టీం బోణీ కొట్టలేకపోతుంది. ఇంకో మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు తప్పుకున్నట్లే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.