IPL 2022 PRIYAM GARG TAKES TWO STUNNING CATCHES AGAINST MUMBAI INDIANS IN IPL 2022 SEASON SJN
Priyam Garg : తొలుత బ్యాట్ తో.. ఆ తర్వాత క్యాచ్ లతో.. సూపర్ మ్యాన్ అనిపించికున్న అండర్ 19 సారథి
ప్రియమ్ గార్గ్ క్యాచ్ (PC : TWITTER)
Priyam Garg : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఎట్టకేలకు వరుస పరాజయాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. గత ఐదు మ్యాచ్ ల్లో ఎదురైన ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకొని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.
Priyam Garg : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఎట్టకేలకు వరుస పరాజయాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. గత ఐదు మ్యాచ్ ల్లో ఎదురైన ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకొని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. ఈ సీజన్ లో ఓపెనర్ గా వస్తూ విఫలమైన సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane williamson) ముంబై తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తన బ్యాటింగ్ స్థానాన్ని మిడిలార్డర్ కు మార్చుకున్నాడు. ఈ క్రమంలో 2019 అండర్ 19లో పాల్గొన్న టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన ప్రియమ్ గార్గ్ ను తుది జట్టులోకి తీసుకుంది.
సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ప్రియమ్ గార్గ్ అటు బ్యాటింగ్ తో ఇటు ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. తొలుత ఓపెనర్ గా వచ్చిన గార్గ్ 26 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. రాహుల్ త్రిపాఠితో కలిసి రెండో వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక అనంతరం ఫీల్డింగ్ లో కూడా గార్గ్ మెరిశాడు. రెండు అద్భుత క్యాచ్ లతో జట్టుకు వికెట్లను అందించడంలో భాగస్వామ్యం అయ్యాడు. తొలుత ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వెనక్కి పరుగెడుతూ గార్గ్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ ను అందుకున్నాడు. అదే సమయంలో వన్ డౌన్ లో ప్రమోట్ అయిన డానియెల్ స్యామ్స్ కవర్స్ లో షాట్ ఆడగా.. అక్కడే ఉన్న గార్గ్ గాల్లోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు.
Omg.......priyam garg....I love you .....how cramped and hard you were for the catching effort.....he fell back and crawled.....100% dedication....
My heart was out of my mouth and my stomach was hot...
❤️❤️💓 pic.twitter.com/tNMTRXlc0P
ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. దాంతో ముంబై ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడే స్కోరును ఉంచగలిగింది. ముంబై బౌలర్లలో రమణ్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.