హోమ్ /వార్తలు /క్రీడలు /

KKR : కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్ ను, సీఈవోను బండ బూతులు తిడుతోన్న ఫ్యాన్స్.. కారణం అదేనా?

KKR : కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్ ను, సీఈవోను బండ బూతులు తిడుతోన్న ఫ్యాన్స్.. కారణం అదేనా?

Fans Slams kkr management(PC : TWITTER)

Fans Slams kkr management(PC : TWITTER)

KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో టైటిల్ ఫేవరెట్లలో ఒక జట్టుగా బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అంచనాలను నిలబెట్టుకోలేకపోతుంది. నిలకడలేని ప్రదర్శన చేస్తూ ఫ్యాన్స్ చేత చివాట్లు తింటుంది.

KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో టైటిల్ ఫేవరెట్లలో ఒక జట్టుగా బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అంచనాలను నిలబెట్టుకోలేకపోతుంది. నిలకడలేని ప్రదర్శన చేస్తూ ఫ్యాన్స్ చేత చివాట్లు తింటుంది. సీజన్ ఆరంభం మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)పై అద్భుత విజయాన్ని అందుకున్న కేకేఆర్ అనంతరం గాడి తప్పింది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ ను కఠిన తరం చేసుకుంది. అధికారికంగా కేకేఆర్ కు ఇప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నా. అది ఇతర జట్ల ఆటపై కూడా ఆధారపడి ఉంది. అయితే ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై విజయం సాధించిన అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి  : సల్మాన్ ఖాన్ ఎవరో నాకు తెలీదు కానీ.. మహేశ్ బాబు పోకిరీ డైలాగ్ తో అదరగొట్టిన పంజాబ్ బౌలర్

శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం, హెడ్ కోచ్ ల పై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ సీజన్ లో కేకేఆర్ జట్టు ప్రతి మ్యాచ్ లోనూ తమ తుది జట్టులో ఏదో ఒక మార్పును చేస్తునే ఉన్నారు. ముంబై తో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా 5 మార్పులను చేసింది. దీనిపై పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కామెంటేటర్ శ్రేయస్ అయ్యర్ ను ప్రశ్నించగా.. అందుకు అతడు ఇచ్చిన రిప్లే ఆప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే.. ’ప్రతి మ్యాచ్ ముందర మిమ్మల్ని ఈ మ్యాచ్ లో ఆడించలేం అని ప్లేయర్స్ తో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. జట్టు సెలెక్షన్ లో హెడ్ కోచ్ తో పాటు సీఈవో వెంకీ మైసూర్ కూడా పాల్గొంటారు. తాము నేటి మ్యాచ్ లో ఆడటం లేదని తెలుసుకున్న ప్లేయర్స్ అందుకు సిద్ధంగానే ఉంటున్నారు.  అలాగే జట్టు విజయం కోసం వీరంతా కష్టపడుతున్నారు.‘ అని మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై కేకేఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సరైన తుది జట్టును ఎంపిక చేసుకోలేని బ్రెండన్ మెకల్లమ్ హెడ్ కోచ్ గా పనికి రాడంటూ.. అతడిని వెంటనే తొలగించాలంటూ పట్టుబడుతున్నారు. అదే సమయంలో జట్టు అంతర్గత విషయాల్లో సీఈవోకు ఏం పనంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

కేకేఆర్ లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ ల్లో నెగ్గి 7 మ్యాచ్ ల్లో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో లీగ్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది. అధికారికంగా కేకేఆర్ జట్టుకు ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నా.. అది జరగడం దాదాపుగా అసాధ్యం.

First published:

Tags: Andre Russell, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Pat cummins, Rashid Khan, Shreyas Iyer

ఉత్తమ కథలు