Virat Kohli : ఇంతకీ విరాట్ కోహ్లీ ఎవరిని హెల్ప్ అడిగినట్లు.. రోహిత్ నా లేక పంత్ నా? ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఫైర్
Virat Kohli
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్, టక్నో, రాజస్తాన్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. చివరి స్థానం కోసం ఢిల్లీ, ఆర్సీబీ జట్లు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఆర్సీబీ టీం ముంబైకి మద్దతు పలికింది.
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు ఒకరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే.. నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangaore) మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఆధారపడాల్సి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్ ముందు వరకు కూడా ఆర్సీబీ 16 పాయింట్లతో.. ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఉన్నాయి. నెట్ రన్ రేట్ విషయంలో ఢిల్లీ జట్టు మెరుగ్గా ఉండటంతో.. ముంబై తో మ్యాచ్ లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని అందరికీ తెలుసు.
ఇక ఆర్సీబీ డాషింగ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ అయితే తాను గతంలో ముంబై తరఫున ఆడిన మ్యాచ్ కు సంబంధించిన పిక్ ను పోస్ట్ చేసి.. ముంబై జట్టుకు బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇక విరాట్ కోహ్లీ అభిమానులు ఆర్సీబీ అభిమానులు రోహిత్ జపం చేశారు. తీరా మ్యాచ్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మ 13 బంతుల్ల ో2 పరుగులు చేసి టెస్టు ఇన్నింగ్స్ ను తలపించాడు. అదే సమయంలో గెలిచే దశలో ఒక క్యాచ్ ను నేలపాలు చేసిన పంత్.. కీలక సమయంలో DRS తీసుకోకుండా ఆర్సీబీ విజయానికి కారణమయ్యాడు. అంతే కాకుండా తాను బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో అనవసరపు షాట్ కు వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. ఇప్పుడు వీటికి సంబంధించి ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ’ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి విరాట్ కోహ్లీ రోహిత్ ను సాయం అడిగాడా? లేక పంత్?నా‘ అనే అర్థం వచ్చేలా ఒకరు కామెంట్ చేస్తే.. పంత్ బ్యాటింగ్ ను విమర్శిస్తూ చాలా మంది పోస్ట్ లు పెట్టారు.
It's more like DC is losing than MI winning. Kohli asked for help from Rohit or Pant? #IPL
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రొవెమన్ పావెల్ (34 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (33 బంతుల్లో 39 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. తన అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ జోరుకు బ్రేకులు వేశాడు. రమణ్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్స్, మార్కండే చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ (33 బంతుల్లో 37 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ ( 17 బంతుల్లో 21 పరుగులు ; 1 ఫోర్, 1సిక్సర్) మెరుపులు మెరిపించడంతో ఈ సీజన్ ను ముంబై సూపర్ విక్టరీతో ముగించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.