ఐపీఎల్ 2022 (IPL 2022)వ సీజన్ లీగ్ స్టేజీ హోరాహోరీగా సాగుతోంది. నెలన్నర రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్నఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా దాదాపు 12 మ్యాచ్ లు ఆడేశాయి. మరో 10 రోజుల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి నాలుగు స్థానాల్లో... ప్లే ఆఫ్ రేసులో గుజరాత్, లక్నో ముందు నిలిచాయ్. మిగిలిన రెండు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ను ఓడించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ 11 బంతులు మిగిలుండగానే, 8 వికెట్లతో తేడాతో విక్టరీ సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘోర పరాజయం తర్వాత టోర్నీలో ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయ్. అయితే, ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న రాజస్థాన్ రాయల్స్‌ను రిషబ్ పంత్ జట్టు సులువుగా ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 12 పాయింట్లు దక్కాయ్. ఢిల్లీ విజయం తర్వాత కూడా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ రాజస్థాన్, ఆర్‌సీబీల మధ్య ఉన్న అంతరం తగ్గింది. ఆ రెండు 14 పాయింట్లు ఉన్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, ఆర్సీబీలు 12 మ్యాచ్‌లు ఆడాయి. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్, ఆర్‌సీబీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. అలా కాకుండా వచ్చే రెండు మ్యాచ్ ల్లో ఢిల్లీ గెలిస్తే.. మంచి రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్ కు చేరుకోవడంతోపాటు ఈ రెండు జట్లలో ఒకరి అవకాశాలు తెరపడే అవకాశం ఉంది.
ఢిల్లీ విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లలో కూడా టెన్షన్ ని పెంచింది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఒక్కొక్కరికి 10 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మంచి రన్‌రేట్‌తో గెలవాలి. అప్పుడే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగ్గా మారుతాయ్. మిగిలిన మ్యాచులో ఏ ఒక్కటి ఓడినా వారి అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయ్.
టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించకోనున్నాయ్. కానీ దాని కోసం, వారు మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాలి మరియు ఇతర ఫలితాలపై ఆధారపడాలి. టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముంబై.. తన మిగతా మ్యాచుల్లో గెలిస్తే.. ఇతర జట్ల అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, Delhi Capitals, IPL 2022, Kolkata Knight Riders, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad