ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఊహకందని ట్విస్టులతో ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రతి జట్టు కూడా 12 మ్యాచ్ లను పూర్తి చేసుకోగా వచ్చే వారంతో లీగ్ స్టేజ్ కు ఎండ్ కార్డ్ పడబోతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మాత్రమే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక, లేటెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్‌ను 24 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు ఏ జట్టు కూడా 20 పాయింట్లకు చేరుకోవడం కష్టమే. గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 10 గెలిచి 20 పాయింట్లతో ఉంది. చెరో 13 మ్యాచుల ఆడిన తర్వాత రాజస్థాన్, లక్నో 16-16 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. దీంతో లక్నో జట్టు 8 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో.. ఫ్లే ఆఫ్ రేస్ లో మరింత కఠినంగా మారింది.
ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్ రేసులో ఇప్పటికే ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ ఔట్ . 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే సామర్థ్యం కేవలం మూడు జట్లకు మాత్రమే ఉంది. ఇక, సోమవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు 16 పాయింట్లకు చేరుకోదు. దీంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు కూడా గరిష్టంగా 14 పాయింట్లు సాధించే ఛాన్స్ ఉంది. అటువంటి పరిస్థితిలో, RCB జట్టు మే 19 న తన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించినట్లయితే, అప్పుడు ఆ జట్టు ఖాతాలో కూడా 16 పాయింట్లు చేరుతాయ్. ఇదే కనుక జరిగితే.. దాదాపు 5 జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ముగిసినట్టే.
ప్రమాదంలో ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ జట్లు
ఢిల్లీ, పంజాబ్‌లకు చెరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయ్. రెండు మ్యాచ్‌లు గెలిచినా జట్టు 16 పాయింట్లు దక్కించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్, లక్నో, ఆర్సీబీలకు పోటీ ఉంటుంది.
పంజాబ్ చివరి మ్యాచ్ హైదరాబాద్ తో ఆడాల్సి ఉండగా ఢిల్లీ చివరి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో ఆడాల్సి ఉంది. మరోవైపు చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోతే.. వాళ్ల అవకాశాలకు ఎండ్ కార్డ్ పడినట్టే. ఇదే జరిగితే.. రాజస్థాన్, లక్నో జట్లు తమ చివరి మ్యాచ్‌లో ఓడినా ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. అంటే ఆర్సీబీ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
RCB ఓడితే వారి ఆట ముగిసినట్టే..
RCB జట్టు తన చివరి మ్యాచ్‌లో ఓడిపోతే, 14 పాయింట్లు మాత్రమే ఆ టీమ్ ఖాతాలో ఉంటాయ్. అప్పుడు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకునే ఛాన్స్ ఉంది. దీనికి నెట్ రన్‌రేట్ చాలా ముఖ్యం. RCB నెట్ రన్ రేట్ ప్రస్తుతం మైనస్‌లో ఉంది. ఆ జట్టు ఓడిపోతే.. ఈ రన్ రేట్ మరింత దిగజారే ప్రమాదముంది.
అంటే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు దారి మూసుకుపోయినట్టే. చివరి మ్యాచ్‌లో లక్నోతో కేకేఆర్ తలపడాల్సి ఉంది. మరోవైపు రాజస్థాన్, లక్నోలు చివరి మ్యాచ్‌లో గెలిచి టాప్-2లో నిలవాలని భావిస్తున్నాయి. టాప్-2 లో నిలిస్తే.. ఫైనల్ కు చేరుకోవడానికి రెండు అవకాశాలు ఉంటాయ్.
ఇది కూడా చదవండి : ఇదేంది రా బాబు.. వీడు మారడా.! సన్ రైజర్స్ ప్లేయర్ పై బ్రియాన్ లారా రియాక్షన్
ఇక, ఐపీఎల్ 2022 లీగ్ రౌండ్లో ఇంకా 7 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 10 జట్లు ఉండటంతో ఈసారి మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. లీగ్ చివరి మ్యాచ్ మే 22న జరగనుంది. నాకౌట్ రౌండ్ మ్యాచులు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయి. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి టీ20 లీగ్‌లో కొత్త ఛాంపియన్ అవతరిచడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Gujarat Titans, IPL 2022, Kolkata Knight Riders, Lucknow Super Giants, Punjab kings, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad