Home /News /sports /

IPL 2022 PLAYERS RETENTION DEAD LINE IS NOVEMBER 30TH SUNRISERS HYDERABAD WANTS TO RETAIN ONLY KANE AND RASHID JNK

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోబోయేది ఇద్దరినే.. వాళ్లెవరో తెలుసా?

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా? (PC: SRH)

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా? (PC: SRH)

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022 మెగా వేలం జనవరిలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పాత 8 జట్లు ఈ నెలాఖరులోగా ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారో వివరాలు తెలుపాల్సి ఉన్నది. మిగిలిన ఆటగాళ్లను ఆయా జట్లు విడుదల చేయవలసి ఉన్నది.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం బీసీసీఐ (BCCI) జనవరిలో మెగా వేలం (Mega Auction) నిర్వహించనున్నది. ఈ నెలాఖరులోగా ఆయా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు ప్రకటించాలని డెడ్ లైన్ విధించింది. ఇంకా ఆరు రోజులే ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్‌పై (Players Retention Policy) కసరత్తు చేస్తున్నాయి. నవంబర్ 30 మధ్యాహ్నం 12.00 గంటల కల్లా ఆయా జట్లు తమ ఆటగాళ్ల వివరాలను బీసీసీఐకి పంపించాల్సి ఉన్నది. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిటెన్షన్ కాని ఆటగాళ్లను సెంట్రల్ పూల్‌లో అందుబాటులో ఉంటారు. ఆ పూల్ నుంచి నెల రోజుల్లో గా కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ సారి రైట్ టూ మ్యాచ్ నిబంధన అమలులోకి లేదు కాబట్టి.. ఫ్రీ పికప్‌లో గాని.. వేలంలో గాని ఇతర ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లను ఆర్టీఎం ద్వారా తీసుకునే వీలుండదు. అయితే వేలం పాటలో మాత్రం పోటీ పడి కొనుగోలు చేయవచ్చు.

    ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఈ సారి పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగనున్నది. గత సీజన్‌లోనే పేలవ ఫామ్‌తో కెప్టెన్సీ సహా జట్టులో చోటు కూడా కోల్పోయిన డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీ రిటెన్షన్ చేసుకోవడం లేదు. అంతే కాకుండా జట్టులోని ఏ స్వదేశీ ఆటగాడిని కూడా తీసుకోవడానికి ఫ్రాంచైజీ సిద్దంగా లేదు. కేవలం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (Kane William Son), అఫ్గానిస్తాన్ మిస్టరీ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను (Rashid Khan) మాత్రమే తీసుకోవాలని సన్‌రైజర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ప్రకారం ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే మొదటి ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, రెండవ ప్లేయర్‌కు రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

    IPL 2022: ఐపీఎల్ 2022 ఎప్పుడు.. ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? బీసీసీఐ ఫిక్స్ చేయనున్న డేట్, వేదికల వివరాలు ఇవే



     రాబోయే మెగా వేలంలో ప్రతీ జట్టుకు రూ. 90 కోట్లు ప్లేయర్ పర్స్ వాల్యూ ఉంటుంది. గత ఏడాది కంటే ఇది రూ. 5 కోట్లు ఎక్కువ. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్‌సన్, రషీద్ ఖాన్‌కు రూ. 24 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఇంకా రూ. 66 కోట్లు మిగులు ఉంటుంది. ఈ డబ్బును ఉపయోగించి వేలంలో నాణ్యమైన, ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నది. ముఖ్యంగా వేలంలో ఉంటే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పాండ్యా బ్రదర్స్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. మరి సన్‌రైజర్స్ మెగా వేలంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుందో వేచి చూడాలి.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, IPL, IPL 2022, Kane Williamson, Rashid Khan, Sunrisers Hyderabad

    తదుపరి వార్తలు