IPL 2022 PBSK VS DC LIVE SCORES DAVID WARNER GOT GOLDEN DUCK FOR THE FIRST TIME IN LAST 8 YEARS SJN
David Warner : ఏంది వార్నర్ భాయ్ ఇలా చేశావ్.. వెళ్లి మరీ తన్నించుకున్నట్లు ఉంది నీ వాలకం చూస్తే..
వార్నర్ (PC : TWITTER)
David Warner : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
David Warner : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అయితే అతడు అవుటైన తీరు మాత్రం హాస్యాస్పదంగా మారింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా వార్నర్, సర్ఫరాజ్ ఖాన్ లు క్రీజులోకి వచ్చారు. వాస్తవానికి వార్నర్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్తాడు.
ఈ మ్యాచ్ లోనూ వార్నర్ మొదట నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో వెళ్లి నిలబడ్డాడు. అయితే గత మ్యాచ్ ల్లో ఓపెనర్లుగా వచ్చిన మన్ దీప్ సింగ్, కేఎస్ భరత్ లు తొలి ఓవర్లోనే అవుటవ్వడాన్ని గుర్తు తెచ్చుకున్నాడో ఏమో.. సడెన్ గా పిచ్ మధ్యకు వచ్చి సర్ఫరాజ్ ను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్లాల్సిందిగా సూచించాడు. సీనియర్ చెప్పడంతో సర్ఫరాజ్ మరో మాట చెప్పకుండా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్లి నిలబడ్డాడు. అయితే లివింగ్ స్టోన్ వేసిన తొలి బంతికే వార్నర్ అవుటవ్వడం విశేషం. అవుటవ్వడానికే ఎండ్స్ మారావా వార్నర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
David Warner opting to take strike after initially being at the non-striker's end, facing up to Liam Livingstone's all-sorts, and then getting out first ball of the match would be a great story.... if Warner wasn't in my fantasy team. #PBKSvDC
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.