IPL 2022 PBKS VS LSG LUCKNOW SUPERGIANTS CAPTAIN KL RAHUL TAKES STUNNING CATCH OF PUNJAB KINGS OPENER MAYANK AGARWAL SJN
IPL 2022 : వారెవ్వా వాట్ ఏ క్యాచ్.. సూపర్ క్యాచ్ తో మెరిసిన రాహుల్.. వీడియో వైరల్
కేఎల్ రాహుల్ క్యాచ్ (PC : IPL)
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరే చేసినా అనంతరం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్ ను కట్టడి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరే చేసినా అనంతరం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్ ను కట్టడి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అయితే కేఎల్ రాహుల్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఐదో ఓవర్ వేయడానికి చమీర బౌలింగ్ కు రాగా.. తొలుత మయాంక్ దూకుడు ప్రదర్శించాడు. అయితే నాలుగో బంతిని మిడాఫ్ మీదుగా ఆడబోయాడు. చమీర వేసిన మయాంక్ చక్కగా టైమింగ్ చేయడంతో బంతి మిడాఫ్ మీదుగా బౌండరీ వైపు దూసుకెళ్లింది. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న కేఎల్ రాహుల్ బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతిని అద్బుతంగా గాల్లోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు. ఇతర క్యాచ్ ల్లో ఇందులో డైవ్ చేయడం.. పరుగెత్తుకుంటూ వెళ్లడం లాంటివి లేకపోయినా.. ఇది కూడా అద్భుత క్యాచ్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ బంతిని అంత చక్కగా టైమ్ చేశాడు. రాకెట్ లా దూసుకొచ్చిన బంతిని కేఎల్ రాహుల్ అద్భుత రీతిలో ఒడిసి పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టులో క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబడతో పాటు రాహుల్ చహర్ కూడా రాణించాడు. చహర్ 2 వికెట్లు తీశాడు. కేఎల్ రాహుల్ కేవలం (6) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో లక్నో జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ జట్టులో జానీ బెయిర్ స్టో (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మోసిన్ ఖాన్ 3 వికెట్లతో సత్తా చాటితే.. దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం ద్వారా లీగ్ లో 6వ విజయాన్ని నమోదు చేసిన లక్నో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.