Home /News /sports /

IPL 2022 PBKS VS LSG LIVE SCORE IPL 2022 PBKS VS LSG LIVE SCORES PUNJAB KINGS WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

PBKS vs LSG : టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. సీనియర్ ఆటగాడిపై వేటు వేసిన లక్నో సూపర్ జెయింట్స్

మయాంక్ వర్సెస్ కేఎల్ రాహుల్ (PC: IPL)

మయాంక్ వర్సెస్ కేఎల్ రాహుల్ (PC: IPL)

PBKS vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)  2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో  లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...
PBKS vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)  2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో  లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై ఆడిన జట్టునే కొనసాగించేందుకు పంజాబ్ మొగ్గు చూపింది. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఒక మార్పు చేసింది. ఫామ్ లో లేని మనీశ్ పాండే స్థానంలో గత మ్యాచ్ కు దూరమైన అవేశ్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకుంది. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు రాహుల్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం లక్నో జట్టుకు సారథ్యం వహిస్తూ.. పంజాబ్ పై విజయం సాధించేందుకు పట్టుదలగా ఉన్నాడు.

ఫేవరెట్ గా లక్నో

ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగనుంది. కొత్త జట్టే అయినా లక్నో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ వైపుకు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన లక్నో 5 విజయాలు మూడు పరజయాలతో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కథ మాత్రం మరోలా ఉంది. నిలకడ లేకుండా సీజన్ లో తమ ప్రయాణాన్ని సాగిస్తోంది. ఆడిన 8 మ్యాచ్ ల్లో 4 విజయాలు నాలుగు పరాజయాలతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టకిలో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ వైపు సాగాలంటే పంజాబ్ నిలకడగా ఆడాల్సి ఉంది. శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్ మాత్రమే రాణిస్తోండగా.. మయాంక్ పూర్ ఫామ్ తో జట్టుకు భారంగా ఉన్నాడు. ఇక అదే సమయంలో కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ తో జట్టును నడిపిస్తున్నాడు. సీజన్ లో ఇప్పటికే 2 శతకాలు సాధించిన రాహుల్ జట్టుకు శుభారంభాలు చేస్తున్నాడు. అయితే లక్నో జట్టు ఎక్కువగా రాహుల్ పైనే ఆధారపడి ఉండటం ఆ జట్టుకు ప్రతికూల అంశం. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం పేవరెట్ గా లక్నో జట్టు బరిలోకి దిగనుంది

ఇది కూడా చదవండి : ’ పంత్.. నీకు కెప్టెన్సీ చేయడం వచ్చా.?’ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చురకలు

తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, స్టొయినస్, దీపక్ హుడా,  ఆయుశ్ బదోని, హోల్డర్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మోహిసిస్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

పంజాబ్ కింగ్స్

మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Punjab kings, Shikhar Dhawan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు