హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - PBKS vs KKR : ఉమేశ్ యాదవ్ జోరు.. పంజాబ్ బేజారు.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..

IPL 2022 - PBKS vs KKR : ఉమేశ్ యాదవ్ జోరు.. పంజాబ్ బేజారు.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..

IPL 2022 - PBKS vs KKR : ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే... పంజాబ్ 10 మ్యాచ్ ల్లో నెగ్గింది.

IPL 2022 - PBKS vs KKR : ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే... పంజాబ్ 10 మ్యాచ్ ల్లో నెగ్గింది.

IPL 2022 - PBKS vs KKR : ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే... పంజాబ్ 10 మ్యాచ్ ల్లో నెగ్గింది.

  వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఉమేశ్ దెబ్బకి పంజాబ్ అల్లాడిపోయింది. ఉమేశ్ యాదవ్ దెబ్బకి 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది పంజాబ్ కింగ్స్. బానుక రాజపక్స (9 బంతుల్లో 31 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కగిసో రబాడా (16 బంతుల్లో 25 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) తప్ప పంజాబ్ ఇన్నింగ్స్ లో మెరుపులు ఏమి లేవ్. ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లతో పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. టిమ్ సౌథీ రెండు, శివమ్ మావీ, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ తలా ఓ వికెట్ తో సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను కేకేఆర్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. ఆ జ‌ట్టు కెప్టెన్ మయాంక్ అగ‌ర్వాల్‌ను ఒకే ప‌రుగుకు ఎల్బీడ‌బ్య్లూలో ఔట్ చేశాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన భానుక రాజపక్స విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్ భానుక రాజపక్స ఈ సీజ‌న్‌లో తొలి హ్యాట్రిక్ సిక్స‌ర్ల న‌మోదు చేశాడు. కేకేఆర్ బౌల‌ర్‌ శివ‌మ్ మావి వేసిన నాల్గో ఓవ‌ర్‌లో రాజ‌ప‌క్స ఈ రికార్డును అందుకున్నాడు.

  ఆ ఓవ‌ర్ తొలి బంతిని 4 బాదిన రాజ‌ప‌క్స‌.. రెండు, మూడు, నాలుగు బంతుల‌ను వ‌రుస‌గా సిక్సులు బాదాడు. అయితే దుర‌దృష్ట‌వశాత్తు హ్యాట్రిక్ సిక్ల‌ర్లు బాదిన వెంట‌నే రాజ‌ప‌క్స ఔట్ అయ్యాడు. అదే ఓవ‌ర్‌లో ఐదో బంతిని కూడా భారీ షాట్‌కు ప్ర‌యత్నించిన రాజ‌ప‌క్స పీల్డ‌ర్ సౌథీకి దొరికిపోయాడు. దీంతో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే, క్రీజులో ఎదుర్కొన్న తొలి బంతినే రాజ‌ప‌క్సే బౌండ‌రీతో మొద‌లు పెట్టాడు. ఇక‌ ఈ మ్యాచ్‌లో రాజ‌ప‌క్స 9 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 344 స్ట్రైక్‌రేట్‌తో 31 ప‌రుగులు బాదేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత 16 పరుగులు చేసిన ధావన్‌ సౌథీ బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  ఇక, ఇక్కడ నుంచి ఒక్కటి రెండు మెరుపులు తప్ప.. మిగదంతా కోల్ కతా బౌలర్ల జోరే. 1 ఫోర్, 1 సిక్సర్ కొట్టి మంచి ఊపుమీదున్న లివింగ్ స్టోన్ ని ఉమేశ్ బోల్తా కొట్టించాడు. భారీ షాట్ కు యత్నించిన లివింగ్ స్టోన్ (19) బౌండరీ మీద సౌథీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక, అండర్‌-19 కుర్రాడు రాజ్‌ బవా(11) సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో, పంజాబ్‌ కింగ్స్‌ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా డకౌటయ్యాడు. సౌథీ బౌలింగ్ నితీశ్ రాణాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు షారుఖ్.

  ఆ తర్వాత కేకేఆర్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ తన రెండో స్పెల్‌లో మరోసారి విజృంభించాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ రెండో బంతికి హర్‌ప్రీత్‌ బార్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన ఉమేశ్‌.. నాలుగో బంతికి రాహుల్‌ చహర్‌ను డకౌట్‌ చేశాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ 102 పరుగుల వద్ద 8వ వికెట్‌ కోల్పోయింది. అయితే, ఆఖర్లో కగిసో రబాడా, ఓడియన్ స్మిత్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే... పంజాబ్ 10 మ్యాచ్ ల్లో నెగ్గింది.

  తుది జట్లు :

  కేకేఆర్ : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్, రహానే, నితీశ్ రాణా, బిల్లింగ్స్, , రస్సెల్ నరైన్, సౌతీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి.

  పంజాబ్ : మయాంక్ అగర్వాల్, ధావన్, భానుక రాజపక్స, లివింగ్ స్టోన్, రాజ్ బవ, షారుఖ్ ఖాన్ , ఒడెన్ స్మిత్, హర్పీత్ బ్రార్, అర్ష్ దీప్, కగిసో రబాడా, రాహుల్ చహర్

  First published:

  Tags: Cricket, IPL 2022, Kolkata Knight Riders, Punjab kings, Shreyas Iyer

  ఉత్తమ కథలు