హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - PBKS vs GT : టాస్ గెలిచిన గుజరాత్.. పంజాబ్ జట్టులోకి స్టార్ హిట్టర్.. రెండు మార్పులతో బరిలోకి టైటాన్స్..

IPL 2022 - PBKS vs GT : టాస్ గెలిచిన గుజరాత్.. పంజాబ్ జట్టులోకి స్టార్ హిట్టర్.. రెండు మార్పులతో బరిలోకి టైటాన్స్..

IPL 2022 - PBKS vs GT

IPL 2022 - PBKS vs GT

IPL 2022 - PBKS vs GT : వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా.. రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్ మరో విక్టరీ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

  ఐపీఎల్ 2022లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కాసేపట్లో జరగనుంది. టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా.. రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్ మరో విక్టరీ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇక, గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. విజయ్ శంకర్, వరుణ్ అరోన్ ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో సాయి సుదర్శన్, దర్శన్ నల్ కండేల్ని జట్టులోకి తీసుకుంది. ఇక, పంజాబ్ కింగ్స్ కూడా ఒక మార్పు చేసింది. భానుక రాజపక్స స్థానంలో స్టార్ హిట్టర్ జానీ బెయిర్ స్టోని జట్టులోకి తీసుకుంది.తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏమిటో చాటి చెప్పింది పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. రెండో మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయినా.. వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది. తనకంటే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది.

  పంజాబ్ లో స్టార్లకు కొదవేమీ లేదు. శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కగిసో రబాడా, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, ఓడియన్ స్మిత్ వంటి స్టార్లు ఉన్నారు. అయితే, మయాంక్ అగర్వాల్ ఇక పూర్తి స్థాయిలో సత్తా చాటలేదు. ఈ మ్యాచులో రాణిస్తే గుజరాత్ కు కష్టాలు తప్పవు. శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్ మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే, యంగ్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఇంతవరుకు ఆడలేదు. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, కగిసో రబాడా, వైభవ్ అరోరాలతో స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. యంగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ మంచి ఫామ్ లో ఉన్నాడు.

  ఇక, గుజరాత్ టైటాన్స్‌ కూడా పటిష్టంగానే ఉంది. శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ మంచి ఓపెనింగ్ ఇస్తే.. ఆపై డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాతియా ఒత్తిడి లేకుండా బ్యాట్ జులిపించగలరు. అయితే, త్రీడి ఆటగాడు విజయ్ శంకర్ ఫామ్ ఒకటే గుజరాత్ ను కలవరపెడుతోంది. దీంతో, అతన్ని పక్కన్ పెట్టింది. ఇక, గుజరాత్ జట్టు బ్యాటింగ్ కంటే బౌలింగ్ బాగుంది. లూకీ ఫెర్గూసన్, మొహ్మద్ షమీ, రషీద్ ఖాన్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా ఫెర్గూసన్, షమీ, రషీద్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలరు.

  తుది జట్లు :

  పంజాబ్‌ కింగ్స్‌: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారూక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), కగిసో రబాడ, ఓడెన్ స్మిత్, వైభవ్ అరోరా, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్.

  గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వెడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, అభినవ్ మనోహర్, దర్శన్ నల్ కండే, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Gujarat Titans, Hardik Pandya, IPL 2022, Lucknow Super Giants

  ఉత్తమ కథలు