PBKS vs DC : డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొట్టింది. ప్రత్యర్థి ముందు తక్కువ స్కోరునే టార్గెట్ గా ఉంచినా సమష్టిగా రాణించి అద్బుత విజయాన్ని అందుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఘనవిజయం సాధించింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ ల ో విజయం సాధించడం ఎంతో కీలకంగా ఉండింది. అయితే ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ఢిల్లీ పంజాబ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. లార్డ్ శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టార్ ప్లేయర్స్ విఫలమైనా జితేశ్ శర్మ ( 34 బంతుల్లో 44 ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకు పోరాడాడు. ఈ విజయంతో 14 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ తన తదుపరి పోరులో ముంబై ఇండియన్స్ ను ఢీ కొట్టనుంది.
ఇది కూడా చదవండి : ఏంది వార్నర్ భాయ్ ఇలా చేశావ్.. వెళ్లి మరీ తన్నించుకున్నట్లు ఉంది నీ వాలకం చూస్తే..
160 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు బెయిర్ స్టో (28), శిఖర్ ధావన్ (19) మంచి శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. బెయిర్ స్టోను నోకియా పెవిలియన్ కు చేర్చడంతో పంజాబ్ పతనం ఆరంభం అయ్యింది. పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో పరుగుల కోసం పంజాబ్ బ్యాటర్స్ తంటాలు పడ్డారు. తొందర పడి అనవసరపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. భానుక రాజపక్స (4), లివింగ్ స్టోన్ (3) భారీ షాట్లకు పోయి పెవలియన్ కు చేరారు. ఇక మయాంక్ అగర్వాల్ (0) ఈ సీజన్ లో మరోసారి నిరాశ పరిచాడు. అయితే జితేశ్ శర్మ మాత్రం ఆచి తూచి ఆడుతూ జట్టును విజయం వైపు నడిపాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ (25 నాటౌట్; 2 ఫోర్లు ,1 సిక్స్) తో కలిసి జట్టుకు విజయాన్ని అందించేలా కనిపించాడు. అయితే వార్నర్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో పంజాబ్ ఓటమి ఖాయం అయ్యింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ డేవిడ్ వార్నర్ తో పాటు మొత్తంగా 3 వికెట్లు తీసి ఢిల్లీ నడ్డి విరిచాడు. అర్ష్ దీప్ సింగ్ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఢిల్లీ బ్యాటర్స్ లో మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దాంతో ఢిల్లీ జట్టు ఫైటింగ్ టోటల్ ను పంజాబ్ ముందు ఉంచగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Kumble, David Warner, Delhi Capitals, IPL, IPL 2022, Prithvi shaw, Punjab kings, Rishabh Pant, Shikhar Dhawan