Home /News /sports /

IPL 2022 PAKISTHAN WICKET KEEPER MOHAMMED RIZWAN MADE SOME INTERESTING COMMENTS ON VIRAT KOHLI CURRENT FORM AND HE PRAY FOR TEAM INDIA EX SKIPPER SRD

Virat Kohli : ' ఆ అల్లాను ప్రార్థిస్తున్నా.. విరాట్ కోహ్లీ ఫాంలోకి రావాలి '.. పాక్ స్టార్ క్రికెటర్..

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

Virat Kohli : విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ ఫాం నడుస్తోంది. ఐపీఎల్ లో ఎన్నడూ లేని విధంగా తాజా సీజన్లో చెత్త ప్రదర్శనతో తన అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా మూడు సార్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.

    విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఒకానొక సమయంలో టీమిండియా (Team India)కు వెన్నెముకల ఉన్నాడు. అయితే గత రెండేళ్లుగా పూర్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఈ సమయంలో ఒక్క సెంచరీని కూడా చేయలేకపోయిన ఈ రన్ మిషీన్.. నిలకడలేని బ్యాటింగ్ తో అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గా అన్ని ఫార్మాట్ల నుంచి దిగిపోయిన కోహ్లీ.. ఇప్పుడు ఆటగాడిగా భారత జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎన్నడూ లేని విధంగా తాజా సీజన్లో చెత్త ప్రదర్శనతో తన అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా మూడు సార్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతని కెరీర్‌ చివరి దశకు చేరిందనే ప్రచారం ఊపందుకుంది.

    దీంతో.. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావాలని ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) చేరిపోయాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌ అందుకోవాలని పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆకాంక్షించాడు. అందుకోసం ఆ అల్లాను ప్రార్థిస్తానని చెప్పాడు.ఈ నేపథ్యంలోనే రిజ్వాన్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు.

    " విరాట్ కోహ్లీ ఓ ఛాంపియన్‌. అయితే, ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అందుకోసం నేను ప్రార్థిస్తా. ఎందుకంటే అతను చాలా కష్టపడే ఆటగాడు. ఆటగాళ్లకు కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తర్వాత తిరిగి పుంజుకుంటారు. క్రికెట్‌లో ఎంతో మంది సెంచరీలు కొట్టారు. అవి అలాగే జరిగిపోతుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని కోసం నేను దేవుడిని మాత్రమే ప్రార్థించగలను. విరాట్ మరింత కష్టపడి పరిస్థితుల్ని మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా " అని రిజ్వాన్‌ చెప్పుకొచ్చాడు.

    పాక్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, రిజ్వాన్ లతో కోహ్లీ..


    మరోవైపు..అప్‌కమింగ్ సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారని పెద్ద ఎత్తున రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీపై వేటు గురించి వస్తున్న రూమర్స్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు స్పందించారు.

    ఇది కూడా చదవండి : ఈ ఐదుగురు ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. వదిలించుకోవడానికి రెడీ అయిన జట్లు..!

    విరాట్ కోహ్లీ అనుమతి లేకుండా అతన్ని టీమ్ నుంచి తప్పించమని స్పష్టం చేశాడు. " ప్రతీ క్రికెటర్‌కు కెరీర్‌లో ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. కోహ్లీ కూడా ఇప్పుడు ఆ దశలోనే ఉన్నాడు. కానీ.. తప్పకుండా పేలవ ఫామ్‌ను అతను అధిగమిస్తాడు. అయితే.. ఒక సెలెక్టర్‌గా మేం.. జట్టు గురించి ఆలోచిస్తాం. మా మొదటి ప్రాధాన్యత కూడా జట్టే. అయితే.. టీమ్ సెలక్షన్‌కు ముందు విరాట్ కోహ్లీ‌తో మేము ఒకసారి మాట్లాడతాం. ఒకవేళ అతను బ్రేక్ తీసుకోవాలని అనుకుంటే? తీసుకోవచ్చు. అలాకాకుండా ఫామ్ కోసం ఫైట్ చేస్తానన్న అతనికి అవకాశం ఇస్తాం'' అని సదరు సెలెక్టర్ స్పష్టం చేశాడు.

    ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ కూడా జరగనుండటంతో.. విరాట్ కోహ్లీ ఫామ్‌పై టీమిండియాలోనూ ఆందోళన మొదలైంది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటర్‌గా రాణిస్తాడని భావించిన కోహ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India VS Pakistan, IPL 2022, T20 World Cup 2022, Team India, Virat kohli

    తదుపరి వార్తలు