IPL 2022 PAKISTAN CRICKET BOARD ANGRY ON BABAR AZAM FOR BRINGING HIS BROTHER FOR PRACTICE SJN
Babar Azam : సోదరుడిపై ప్రేమ ఎంత పని చేయించింది.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై పీసీబీ సీరియస్.. కెప్టెన్సీపై వేటు తప్పదా?
బాబర్ ఆజం (ఫైల్ ఫోటో)
Babar Azam : పాకిస్తాన్ క్రికెట్ (Pakistan)లో ఎప్పుడూ ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. స్పాట్ ఫిక్సింగ్.. చెత్త ఫీల్డింగ్.. లేదంటే సీనియర్ క్రికెటర్లపై ఫిర్యాదులు ఇలా ఎదో ఒక రోజు పాకిస్తాన్ క్రికెట్ లో వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది.
Babar Azam : పాకిస్తాన్ క్రికెట్ (Pakistan)లో ఎప్పుడూ ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. స్పాట్ ఫిక్సింగ్.. చెత్త ఫీల్డింగ్.. లేదంటే సీనియర్ క్రికెటర్లపై ఫిర్యాదులు ఇలా ఎదో ఒక రోజు పాకిస్తాన్ క్రికెట్ లో వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా మరో వివాదం ఆ జట్టులో చోటు చేసుకుంది. అయితే ఈసారి ఏకంగా కెప్టెన్ బాబర్ ఆజమే ఇరుక్కున్నాడు. అతడు తెలిసి చేశాడో.. లేక తెలియకుండ చేశాడో కానీ.. చివరకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఆగ్రహానికి అయితే గురయ్యాడు. ఇప్పటికైతే ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. బోర్డు పెద్దల మద్దతు లేకపోతే కెప్టెన్సీ ఊడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల బాబర్ ఆజమ్ తన సోదరుడు సఫీర్ ఆజంతో కలిసి లాహోర్ లోని హై పర్ఫార్మెన్స్ సెంటర్ ను సందర్శించాడు. సందర్శించడమే కాకుండా తన సోదరుడితో నెట్ ప్రాక్టీస్ కూాడా చేయించాడు. ఈ ప్రాక్టీస్ ను వీడియో తీయించుకున్న సఫీర్.. దానిని సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేశాడు. అది కాస్తా బహిర్గతం అవ్వడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాబర్ ఆజంపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ హై పర్ఫార్మెన్స్ సెంటర్ లోకి కేవలం పీసీబీ అధికారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్, జూనియర్ క్రికెటర్లు మినహా వేరెవరికి ప్రవేశం లేదు. అయితే సఫీర్ ఆజం ఇప్పటి వరకు ఒక్క ఫస్ట్ క్యాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతేకాకుండా జస్ట్ చూడటానికి వెళ్తామంటూ అనుమతి తీసుకుని.. తన సోదరుడితో ప్రాక్టీస్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.
దాంతో పీసీబీ అధికారులు బాబర్ ఆజంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. రూల్స్ ను అతిక్రమించడంపై వివరణ కోరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ వివరణపై పీసీబీ సంతృప్తి చెందకపోతే.. కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం కూడా ఉంది. దీనిపై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ’బాబర్ ఆజం మూడు నాలుగు రోజుల క్రితమే తన సోదరుడితో కలిసి క్యాంప్‌ను సందర్శించాడు. అయితే కేవలం చూడడానికి వచ్చాడనుకొని అనుమతి ఇచ్చామని.. కానీ సఫీర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడన్న విషయం తొలుత మా దృష్టికి రాలేదు. తాజాగా ఈ విషయం తెలియడం.. ఆపై ఏం చేయాలన్న దానిపై మాకు ఒక క్లారిటీ ఉంది’ అని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.