హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : లెజండరీ క్రికెటర్ ను కలిసి టిప్స్ తీసుకున్న ఔట్ ఆఫ్ ఫామ్ కోహ్లీ.. ఆ దిగ్గజానికి SRHతో సంబంధం..!

Virat Kohli : లెజండరీ క్రికెటర్ ను కలిసి టిప్స్ తీసుకున్న ఔట్ ఆఫ్ ఫామ్ కోహ్లీ.. ఆ దిగ్గజానికి SRHతో సంబంధం..!

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

Virat Kohli : వరుస వైఫల్యాలతో విరాట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మాజీ క్రికెటర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. RCB కోచ్ కూడా అతను గొప్ప ఫామ్‌లో లేడని అంగీకరించాడు. ఈ గందరగోళంలో లెజండరీ క్రికెటర్ ను కలిసి చిట్కాలు తీసుకున్నాడు కోహ్లీ.

ఇంకా చదవండి ...

  విరాట్ కోహ్లీ (Virat Kohli).. రికార్డుల రారాజు. ఒకప్పుడు ఇతడు ఆడిన తీరును చూస్తే సచిన్ రికార్డులు గల్లంతవ్వడానికి ఎంతో సమయం పట్టదనిపించేది. మైదానంలోకి అడుగు పెడితే సెంచరీ చేసే వరకు లేదా జట్టును గెలిపించే వరకు అవుటవ్వను అన్న రీతిలో కోహ్లీ బ్యాటింగ్ సాగేది. కోహ్లీని అవుట్ చేయడానికి మా దగ్గర వ్యూహాలు లేవంటూ పలువరు కెప్టెన్లు భావించేవారంటే అతిశయోక్తి కాదు. కానీ, ప్రస్తుతం ఈ దిగ్గజ క్రికెటర్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఫాం లేక నానా తంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన కంటిన్యూ అవుతోంది. అలాంటి, ఇలాంటి చెత్త ప్రదర్శన కాదు. వరుసగా రెండు మ్యాచులో కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తొలి బంతికే అవుటవ్వగా.. తాజాగా శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లోనూ తొలి బంతికే అవుటయ్యాడు. ఈ క్రమంలో అతడు తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

  తన 14 ఏళ్ల కెరీర్ లో కోహ్లీ ఎన్నడూ వరుసగా రెండు మ్యాచ్ ల్లో గోల్డెన్ డకౌట్ అవ్వలేదు. కానీ, ఈ ఐపీఎల్ ద్వారా ఆ చెత్తనూ మూట గట్టుకున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయిన అతడు.. తాజాగా సన్ రైజర్స్ చేతిలోనూ తొలి బంతికే అవుటయ్యాడు. కోహ్లీ బలహీనతను ముందే గుర్తించిన విలియమ్సన్.. అతడు బ్యాటింగ్ కు రాగానే రెండో స్లిప్ ను ఏర్పాటు చేశాడు. మార్కో జన్సెన్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లీ సెకండ్ స్లిప్ లో ఉన్న మార్కరమ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

  ఇది కూడా చదవండి : ఆరేళ్ల ఏజ్ గ్యాప్.. పెద్దలకు అబద్ధాలు.. క్రికెట్ గాడ్ ప్రేమ్ కహానీ సూపరో సూపర్..

  ఈ సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. కోహ్లీ గత నాలుగు మ్యాచ్ ల ప్రదర్శనను చూస్తే 1 (చెన్నైపై), 12 (ఢిల్లీ క్యాపిటల్స్)పై, 0 (లక్నోపై), 0 (సన్ రైజర్స్) పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాలతో విరాట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మాజీ క్రికెటర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. RCB కోచ్ కూడా అతను గొప్ప ఫామ్‌లో లేడని అంగీకరించాడు.


  ఈ గందరగోళంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ గ్రేట్ క్రికెటర్ బ్రియాన్ లారా (Brian Lara)ను కలిశాడు. లారా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సలహాదారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RCB కూడా ఈ ఫోటోను తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. లారా దగ్గర కొన్ని చిట్కాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, RCB తదుపరి మ్యాచ్ మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతుంది. దీంతో, బ్రియాన్ లారా ఇచ్చే చిట్కాలు విరాట్‌కు ఏమైనా ఉపయోగపడతాయా అనేది మంగళవారం తేలనుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

  ఉత్తమ కథలు