Suresh Raina : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. గత సీజన్ లో ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన ఆ జట్టు.. ఈ సీజన్ లో డిఫెండింగ్ హోదాతో బరిలోకి దిగింది. అయితే ఏ మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఆడిన 12 మ్యాచ్ ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి 8 మ్యాచ్ ల్లో ఓడింది. ఇక గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో అయితే చెన్నై ఈ సీజన్ లోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 97 పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఓడిపోయింది.
తాజాగా ఈ మ్యాచ్ లో చెన్నై పరిస్థితిపై టీమిండియా మాజీ ప్లేయర్స్ యువరాజ్ సింగ్, సురేశ్ రైనాల మధ్య జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది. యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు కలిసి ఒక ఇండోర్ ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు. ఆ మ్యాచ్ మధ్యలో యువరాజ్ సింగ్... ’ ఏంటి రైనా చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 97 పరుగులకే ఆలౌటైంది‘ అంటాడు. దానికి బదులుగా రైనా ’నేను ఆ మ్యాచ్ లో ఆడలేదు‘ అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ను యువీ, రైనాలతో పాటు బాలీవుడ్ నటులు సోనూ సూద్, సునీల్ శెట్టిలు కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు హారజరయ్యారు.
When Yuvraj Singh made fun of CSK in front of Raina!😅🤜🤛#CSK #MI #fun #IPL2022 #IPL @YUVSTRONG12 @ImRaina pic.twitter.com/vzVWbnKHDp
— VivekThakur (@thakur_vivek00) May 12, 2022
సురేశ్ రైనా మాటల్లో అర్థం ఏంటంటే.. తాను చెన్నై తరఫున ఆడి ఉంటే 97 పరుగులకు ఆలౌట్ కాకుండా చూసుకునే వాడినని. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి కూడా రైనా చెన్నై తరఫునే ఆడుతూ వచ్చాడు. చెన్నై అభిమానులు సురేశ్ రైనాను ముద్దుగా చిన్న తలా అంటూ పిల్చుకుంటారు. గాయం వల్ల ధోని కొన్ని మ్యాచ్ లకు ఆడకపోతే అతడి స్థానంలో రైనా కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో సురేశ్ రైనాను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ విముఖత ప్రదర్శించింది. రూ 2 కోట్లతో వేలంలోకి వచ్చిన రైనాను ఒక్క ఫ్రాంచైజీ కూడా సొంతం చేసుకోలేదు. దాంతో రైనా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Punjab kings, Rohit sharma, Royal Challengers Bangalore, Suresh raina, Virat kohli, Yuvraj Singh