IPL 2022 NEWS BCCI FORMER CHIEF SELECTOR MSK PRASAD PICS FOUR PLAYERS FOR FINISHER ROLE IN TEAM INDIA FOR UPCOMING T20 WORLD CUP SJN
IPL 2022 : టీమిండియా టి20 ప్రపంచకప్ జట్టులో ఈ నలుగురు తప్పక ఉండాల్సిందే.. బీసీసీఐకి సూచించిన మాజీ చీఫ్ సెలెక్టర్
Team India
IPL 2022 : 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత మరో ప్రపంచకప్ ను భారత క్రికెట్ జట్టు ముద్దాడనే లేదు. 2014 టి20 ప్రపంచకప్ లో ఫైనల్ వరకు చేరినా.. అక్కడ శ్రీలంక (Sri Lanka) చేతిలో ఖంగుతింది. అనంతరం 2015, 2019 వన్డే ప్రపంచపక్ లలో సెమీఫైనల్ వరకు మాత్రమే చేరుకోగలిగింది.
IPL 2022 : 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత మరో ప్రపంచకప్ ను భారత క్రికెట్ జట్టు ముద్దాడనే లేదు. 2014 టి20 ప్రపంచకప్ లో ఫైనల్ వరకు చేరినా.. అక్కడ శ్రీలంక (Sri Lanka) చేతిలో ఖంగుతింది. అనంతరం 2015, 2019 వన్డే ప్రపంచపక్ లలో సెమీఫైనల్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత ప్రదర్శన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. సూపర్ 12 దశను కూడా దాటకుండానే టీమిండియా (Team India) ఇంటి దారి పట్టింది. అయితే ఈ ఏడాది మరోసారి టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈసారైన పట్టుదలగా ప్రయత్నించి దశాబ్ద కాలంగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ (ICC) ట్రోఫీని అందుకోవాలనే పట్టుదల మీద టీమిండియా ఉంది.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా కరోనా వల్ల వాయిదా పడ్డ 2020 టి20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్ కు మేటి జట్టును పంపేలా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటి నుంచే తమ కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వీరికి సహాయపడనుంది. ఈ ఐపీఎల్ ద్వారా ఎందరో యువ ఇండియన్ ప్లేయర్స్ తమ ప్రతిభను నిరూపించుకోగా.. జట్టుకు దూరమైన వెటరన్ ప్లేయర్స్ కూడా అదరిపోయే ప్రదర్శన చేసి తమను కూడా గుర్తుపెట్టుకోవాలంటూ బీసీసీఐ సెలక్టర్లకు గుర్తు చేశారు. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే టీమిండియాలో ఈ నలుగురికి తప్పకుండా చోటు ఇవ్వాలంటూ బీసీసీఐకి హితవు పలికాడు.
ఈ ఐపీఎల్ ద్వారా ఇద్దరు అత్యుత్తమ ఫినిషర్లు పరిచయం అయ్యారు. వారిలో ఒకరు దినేశ్ కార్తీక్ కాగా.. మరోకరు గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా. ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ 200 స్ట్రయిక్ రేట్ తో.. 285 పరుగులు చేశాడు. ఆర్సీబీ జట్టుకు తన అసమాన బ్యాటింగ్ తో అద్బుత విజయాలను అందించాడు. ఇప్పటికీ ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉందంటే దానికి కారణం దినేశ్ కార్తీక్. కార్తీక్ తో పాటు రాహుల్ తెవాటియా కూడా ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ పై విజయానికి ఆఖరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు అవసరం అయిన చోట ఒత్తిడికి గురి కాకుండా రెండు సిక్సర్లు బాది తన జట్టుకు అద్బుత విజయాన్ని అందించాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ తో కలిసి గుజరాత్ ను గట్టెక్కించాడు. దాంతో వీరిద్దరు ప్రస్తుతం ఉత్తమ ఫినిషర్లుగా ప్రసాద్ వ్యాఖ్యానించాడు. వీరితో పాటు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలను కూడా టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయాలంటూ బీసీసీఐకి సూచించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.