Home /News /sports /

IPL 2022 MUMBAI WANKHEDE STADIUM IPL STATS PITCH REPORT WEATHER FORECAST DETAILS SJN

IPL 2022: ఈ గ్రౌండ్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల్లో పరుగుల వరద ఖాయం... పండగ చేసుకోనున్న ఆ రెండు జట్లు

వాంఖడే స్టేడియం (ఫైల్ ఫోటో)

వాంఖడే స్టేడియం (ఫైల్ ఫోటో)

IPL 2022: ముంబైలోని స్టేడియాల్లో విఖ్యాత వాంఖడే స్టేడియం, డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాలు ఉన్నాయి. మరో స్టేడియం పుణేలోని ఎంసీఏ స్టేడియం. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాలు చెరో 20 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. బ్రబోర్న్, ఎంసీఏ స్టేడియాలు కలిసి 30 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాంఖడే స్టేడియం వివరాలు గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
IPL 2022: కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ మొత్తం కూడా మహారాష్ట్ర (Maharashtra) వేదికగా జరగనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బీసీసీఐ (BCCI) మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాలను ఎంపిక చేసింది. ఈ నాలుగు స్టేడియాల్లో మూడు మైదానాలు ముంబై (Mumbai)లో ఉండగా... మరోటి పుణేలో ఉంది. ముంబైలోని స్టేడియాల్లో విఖ్యాత వాంఖడే స్టేడియం, డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాలు ఉన్నాయి. మరో స్టేడియం పుణేలోని ఎంసీఏ స్టేడియం. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాలు చెరో 20 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. బ్రబోర్న్, ఎంసీఏ స్టేడియాలు కలిసి 30 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాంఖడే స్టేడియం వివరాలు గురించి తెలుసుకుందాం.

మార్చి 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (kolkata Knight Riders) మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానుంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ గా వాంఖడే ఉంటూ వస్తోంది. అంతేకాకుండా భారత్ విశ్వవిజేతగా నిలిచిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వాంఖడే వేదికగానే జరిగింది.

వాంఖడే స్టేడియం ఐపీఎల్ స్టాట్స్

అత్యధిక స్కోరు : వికెట్ నష్టానికి 235 పరుగులు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం చేసింది.
అత్యల్ప స్కోరు : 67. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఈ స్కోరును నమోదు చేసింది.

అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన : 5/18. హర్భజన్ సింగ్ ఈ ప్రదర్శన చేశాడు.

అత్యధిక పరుగులు: ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు 1733 పరుగులు చేశాడు.

అత్యధిక వికెట్లు: ఈ మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ ఉన్నాడు. అతడు ఈ మైదానంలో 68 వికెట్లు తీశాడు.

అత్యధిక వ్యక్తిగత స్కోరు : ఈ రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ పేరిట ఉంది. అతడు ఈ మైదానంలో 133 పరుగులు చేశాడు.

సీటింగ్ కెపాసిటీ: స్టేడియం కెపాసిటీ 33 వేలు.

పిచ్ స్వభావం: వాంఖడే పిచ్ బ్యాటింగ్ వికెట్. బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తోంది. దాంతో బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకోవడం ఖాయం. ఇక్కడ ఐపీఎల్ సగటు ఇన్నింగ్స్ కు180గా ఉంటే అంతర్జాతీయ మ్యాచ్ లకు మాత్రం 194 పరుగులుగా ఉంది. బౌండరీలు చిన్నవిగా ఉండటంతో పవర్ హిట్టర్లకు పండగే అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ లో వాంఖడేలో 7 లేదా 9 మ్యాచ్ లు జరిగేవి. కానీ ఈసారి కరోనా వల్ల వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. దాంతో మ్యాచ్ లు జరిగే కొద్ది పిచ్ నెమ్మదిగా మారే అవకాశం ఉంటుంది. దాంతో స్పిన్నర్లు, మీడియం పేసర్లు రాణించే అవకాశం ఉంది.

వాతావరణం: ఏప్రిల్, మే నెలల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. అయితే మే నెలలో వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో మే నెలలో జరిగే కొన్ని మ్యాచ్ లకు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు