Home /News /sports /

IPL 2022 MUMBAI INDIANS VS DELHI CAPITALS HEAD TO HEAD RECORDS KEY PLAYERS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS ROHIT SHARMA VS RISHABH PANT SJN

IPL 2022: రోహిత్ శర్మ విజయాల స్ట్రీక్ కు రిషభ్ పంత్ చెక్ పెట్టేనా.. సూర్యకుమార్ స్థానంలో హైదరబాద్ కుర్రాడికి చాన్స్!

రోహిత్, రిషభ్ పంత్

రోహిత్, రిషభ్ పంత్

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రేపు తొలి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా రేపు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడనుంది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రేపు తొలి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా రేపు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడనుంది. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో నెట్ రన్ రేట్ కారణంతో ప్లే ఆఫ్స్ కు చేరుకోలేకపోయిన ముంబై జట్టు ఈ సీజన్ లో అదరగొట్టడానికి రెడీగా ఉంది. మరోవైపు గతేడాది లీగ్ దశలో సూపర్ ఫామ్ తో అదరగొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కూడా అంతకుమించిన ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉంది.

గతేడాది ఐపీఎల్ కు ఈ ఏడాది ఐపీఎల్ కు మధ్య అనేక  అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది ఐపీఎల్ వరకు కూడా కేవలం ముంబై ఇండియన్స్ కు మాత్రమే సారథిగా ఉన్న రోహిత్ శర్మ... ఇప్పుడు టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ తో సిరీస్ మొదలు ఈ నెలలో ముగిసిన శ్రీలంక తో సిరీస్ వరకు వరుస విజయాలతో అదరగొడుతున్నాడు. ఇప్పుడు అదే దూకుడును ఐపీఎల్ లో కూడా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి రోహిత్ దూకుడుకు రిషభ్ పంత్ అడ్డుకట్ట వేయగలడో లేదో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

గాయంతో స్టార్ ప్లేయర్ దూరం

వేలి గాయం కారణంగా ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో రేపు జరిగే ఆరంభ మ్యాచ్ కు దూరమయ్యాడు. సూర్యకుమార్ రేపటి మ్యాచ్ కు దూరమవ్వడం ముంబై బ్యాటింగ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపగలదు. అంతేకాకుండా జట్టు కూర్పు కూడా ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. రీటెయిన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాల తుది జట్టులో ఉండటం ఖాయం... ఇషాన్ కిషన్ కూడా జట్టులో తప్పక ఉంటాడు. ఇక ఫారెన్ ఆటగాళ్ల జాబితాలో పొలార్డ్ తో పాటు బేబీ డీవిలియర్స్ డివాల్డ్ బ్రేవిస్ కు చోటు దక్కేలా కనిపిస్తోంది. అతడు రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో హైదరాబాదీ కుర్రోడు తిలక్ వర్మకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బలంగానే ఉంది. అన్రిచ్  నోర్జే గాయం, ఆరంభ మ్యాచ్ లకు ఆసీస్ స్టార్ ప్లేయర్ వార్నర్ దూరం కావడం మినహా ఆ జట్టుకు పెద్దగా సమస్యలు లేవు. అయితే అనుభవం ఉన్న ప్లేయర్స్ లేకపోడం జట్టుకు సమస్యగా మారొచ్చు. అయితే కోచ్ రికీ పాంటిగ్ అన్నీ తానై జట్టును నడిపించే అవకాశం ఉంది. ఎలాగైనా ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఢిల్లీ జట్టు ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఐపీఎల్ లో రెండు జట్లు మొత్తంగా 30 సార్లు తలపడ్డాయ్. ఇందులో ముంబై ఇండియన్స్ దే పై చేయి. ముంబై 16 సార్లు నెగ్గగా.. ఢిల్లీ 14 సార్లు నెగ్గింది

తుది జట్ల అంచనా

ముంబై ఇండియన్స్ 

రోహిత్ శర్మ (కెప్టెన్), డివాల్డ్ బ్రేవిస్/టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, తిలక్ వర్మ,  అన్మోల్ ప్రీత్ సింగ్, సంజయ్ యాదవ్, మయాంక్  మార్కండే/మురుగన్ అశ్విన్, బుమ్రా, డానియెల్ సామ్స్, తైమల్ మిల్స్

ఢిల్లీ క్యాపిటల్స్

షా, టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్/యశ్ ధుల్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్ మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్/ లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Delhi Capitals, IPL, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు