Home /News /sports /

IPL 2022 MUMBAI INDIANS SPINNER KUMAR KARTIKEYA SINGH DID NOT GO HOME FOR NINE YEARS FOR CRICKET SJN

Kumar Kartikeya Singh : క్రికెట్ కోసం 9 ఏళ్లు ఇంటికి దూరంగా.. రాజస్తాన్ మ్యాచ్ తో తెరపైకి మిస్టరీ స్పిన్నర్..

కుమార్ కార్తికేయ (ఎడమ) (PC : MUMBAI INDIANS)

కుమార్ కార్తికేయ (ఎడమ) (PC : MUMBAI INDIANS)

Kumar Kartikeya Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంతో మంది ప్రతభగల క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. లేటు వయసులో కూడా సంచలనాలు నమోదు చేయవచ్చని ప్రవీణ్ తాంబే లాంటి ప్లేయర్ రూపంలో నిరూపించింది. ఒకరా ఇద్దరా ఐపీఎల్ పుణ్యమా అంటూ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్యా, (Hardik Pandya) సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, చేతన్ సకారియా లాంటి వారు టీమిండియా వరకు రాగాలిగారు.

ఇంకా చదవండి ...
Kumar Kartikeya Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంతో మంది ప్రతభగల క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. లేటు వయసులో కూడా సంచలనాలు నమోదు చేయవచ్చని ప్రవీణ్ తాంబే లాంటి ప్లేయర్ రూపంలో నిరూపించింది. ఒకరా ఇద్దరా ఐపీఎల్ పుణ్యమా అంటూ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్యా, (Hardik Pandya) సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, చేతన్ సకారియా లాంటి వారు టీమిండియా వరకు రాగాలిగారు. ఇక ఈ సీజన్ లో అయితే లెక్కకు మించిన వారు తమ ప్రదర్శనతో తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పటికే తిలక్ వర్మ, ఆయుశ్ బదోని, కుల్దీప్ సేన్, జితేశ్ శర్మ, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ వెలుగులోకి రాగా.. తాజాగా కుమార కార్తికేయ సింగ్ (kumar kartikeya singh) వెలుగులోకి వచ్చాడు.

ఈ ఏడాది ఐపీఎల్ కోసం తమ నెట్ బౌలర్ గా 24 ఏళ్ల కార్తికేయను ముంబై ఇండియన్స్ (Mumbai indians)ఎంపిక చేసుకుంది. అయితే అర్షద్ ఖాన్ గాయపడటంతో అతడి స్థానంలో కార్తికేయను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. ఇక శనివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కార్తికేయ సింగ్ కు తుది జట్టులో అవకాశం కూడా ఇచ్చింది. తొలి మ్యాచ్ తోనే కార్తికేయ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన సంజూ సామ్సన్ వికెట్ ను కూడా తీశాడు. అయితే ఇన్నింగ్స్ విరామం తర్వాత కార్తికేయ సింగ్ ను ఇంటర్వ్యూ చేయగా.. అతడు చెప్పిన సమాధానాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ’కోహ్లీ ఆ కోరికను అదుపు చేసుకోవాలి.. అప్పుడే రాణిస్తాడు‘ రన్ మిషీన్ పై 1983 ప్రపంచకప్ హీరో ఆసక్తికర వ్యాఖ్య

కార్తికేయ సింగ్ మధ్యప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో జన్మించాడు. క్రికెట్ కోసం 15 ఏళ్ల వయసులో ఇంటిని వదిలిన అతడు గత 9 ఏళ్లుగా మళ్లీ తన సొంత ఇంటికి వెళ్లిందే లేదు. ’ మా అమ్మా, నాన్న ఇంటికి రావొచ్చు కదా.. కొన్ని రోజుల పాటు ఉండి వెళ్లొచ్చు కదా అంటూ ఎప్పుడూ ఫోన్ లో అడిగేది. కానీ నేను మాత్రం ఏదైనా సాధించాకే ఇంటికి వస్తా అని చెప్పేవాడిని. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశా. నా జీవితంలో ఇదో గొప్ప విషయం. ఐపీఎల్ ముగిశాక ఈసారి తప్పకుండా ఇంటికి వెళ్తాను‘ అని పేర్కొన్నాడు. తన లక్ష్యం ఐపీఎల్ తో ముగియదని.. ఇంతకంటే పెద్దదే ఉందని ఏం జరిగినా దానిని సాధించే తీరతానని కార్తికేయ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

ఇది కూడా చదవండి : బర్త్ డే రోజు భార్యను ఏడిపించిన రోహిత్ శర్మ.. ఓదార్చిన అశ్విన్ భార్య.. అసలేం జరిగిందంటే?

తొలి మ్యాచ్ లో అతడు బౌలింగ్ చేసే తీరును బట్టి కార్తికేయ సింగ్ మిస్టరీ స్పిన్నర్ లా కనిపించాడు. ఈ విషయాన్ని అతడు కూడా ఒప్పుకున్నాడు. ఎడం చేతి స్పిన్నర్ అయినా చైనామన్ బౌలింగ్ తో పాటు పలు వైవిధ్యమైన బంతులతో అతడు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇదే ప్రదర్శన అతడు కొనసాగిస్తే తొందరలోనే అతడు టీమిండియా తరఫున ఆడే అవకాశం ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Csk, IPL, IPL 2022, Jasprit Bumrah, MS Dhoni, Mumbai Indians, Rajasthan Royals, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Sanju Samson, SRH, Sunrisers Hyderabad

తదుపరి వార్తలు