Tim David : Tim David : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను కట్టిపడేసింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 పరుగలు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం చేశారు.
ఇది కూడా చదవండి : ఎంత పని జేస్తివి టిమ్ డేవిడో.! సచిన్ కూతురి వైరల్ రియాక్షన్..
అయితే కమ్ బ్యాక్ చేసిన హైదరాబాద్ బౌలర్లు ఓపెనర్లతో పాటు తిలక్ వర్మ, స్యామ్స్ వికెట్లను తీసి ముంబై ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే క్రీజులోకి వచ్చిన సింగపూర్ పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ సుడిగాలి లాంటి ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ కు విజయాన్ని దూరం చేసేలా కనిపించాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. ఇక నటరాజన్ వేసిన 18వ ఓవర్ లో అయితే శివాలెత్తిపోయాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో సహా తొలి ఐదు బంతుల్లో మొత్తం 26 పరుగులు సాధించాడు.
TIM DAVID 114m six. 😱😮🔥 pic.twitter.com/OAuQKvxBbr
— Anmol (@anmol1999) May 18, 2022
అయితే చివరి బంతికి సింగిల్ తీసి తిరిగి స్ట్రయిక్ లోకి రావాలనే కోరికతో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. నటరాజన్ వేసిన యార్కర్ ను టిమ్ డేవిడ్ భారీ షాట్ ఆడబోయాడు. అయితే బంతి సరిగ్గా టైమ్ కాకపోవడంతో బాల్ నేరుగా నటరాజన్ వైపు దూసుకెళ్లింది. బాల్ నటరాజన్ చేతికి తగిలి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో వికెట్ల దగ్గర పడింది. లేని పరుగు కోసం టిమ్ డేవిడ్ ప్రయత్నించగా.. బంతిని అందుకున్న నటరాజన్ వికెట్లను గిరాటేసి అతడిని పెలియన్ కు చేర్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ ఆ ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సంజయ్ యాదవ్ వికెట్ ను తీశాడు. డగౌట్ నుంచి ఇదంతా వీక్షించిన టిమ్ డేవిడ్.. తాను అనవసరంగా తొందరపడి అవుటయ్యాననే కారణంతో తన మొహాన్ని జెర్సీతో కవర్ చేసుకొని బాధపడ్డాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Jasprit Bumrah, Kane Williamson, Kolkata Knight Riders, Mumbai Indians, Rohit sharma, Shreyas Iyer, Sunrisers Hyderabad