Home /News /sports /

IPL 2022 MUMBAI INDIANS PLAYER SURYAKUMAR YADAV LIKELY TO MISS THEIR FIRST GAME WITH DELHI CAPITALS DUE TO SUSTAINED INJURY SJN

IPL 2022: ముంబై ఇండియన్స్ కు మరో షాక్... గాయంతో సూర్యకుమార్ కూడా దూరం కానున్నాడా?

సూర్యకుమార్ యాదవ్ (ఫైల్ ఫోటో)

సూర్యకుమార్ యాదవ్ (ఫైల్ ఫోటో)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఆరంభానికి రెండు వారాల కంటే తక్కువ సమయం ఉండగా... ముంబై ఇండియన్స్ ను ఆటగాళ్ల గాయాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు సీజన్ ఆరంభానికి తమ ఫిట్ నెస్ నిరూపించుకునేది అనుమానంగానే ఉంది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ ను రికార్డు స్థాయిలో  ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. గత నెలలో బెంగళూరు (Benguluru) వేదికగా జరిగిన మెగా వేలంలో ఇతర జట్లతో పోటీ పడి మరీ రూ. 8 కోట్లకు సొంతం చేసుకన్న ఇంగ్లండ్ (England) పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడబోతుండటం లేదని తేలగా... తాజాగా మరో స్టార్ బ్యాటర్ గాయం ముంబై టీంను కలవర పెడుతోంది. మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్ వచ్చే ఏడాది నుంచి మాత్రమే ముంబై ఇండియన్స్ కు అందుబాటులో ఉంటాడని సమాచారం. తాజాగా ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (Suryakumar YAdav) కూడా చేరే అవకాశం ఉంది.

సూర్యకుమార్ యాదవ్ టి20ల్లో అదరగొడతాడని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ముంబై ఇండియన్స్ 2022 మెగా వేలానికి ముందు రూ. 8 కోట్లతో రీటెయిన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ తనమీద పెట్టుకున్న అంచనాలను నిజం చేసేలా... సూర్యకుమార్ యాదవ్ వెస్టిండీస్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లో అదరగొట్టాడు. అనంతరం శ్రీలంకతో టి20 సిరీస్ కోసం ప్రిపేర్ అవుతూ గాయం బారిన పడ్డాడు. సూర్యకుమార్ చేతి బొటన వేలుకి ఫ్రాక్చర్ కావడంతో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ కు దూరమయ్యాడు.

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస శిబిరంలో పాల్గొంటున్నాడు.  అయితే ఈ నెల 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై తన ఆరంభ మ్యాచ్ ను ఆడాల్సి ఉంది. అయితే అప్పటికంతా సూర్యకుమార్ యాదవ్ కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 2న రాజస్తాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ నాటికి కోలుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక అప్పటికీ కోలుకోకపోతే ఐపీఎల్ 15వ సీజన్ లో సగం మ్యాచ్ లకు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశం ఉంది.

శ్రీలంకతో టి20 సిరీస్ సందర్భంగా గాయపడ్డ ఇషాన్ కిషన్ కూడా ప్రస్తుతం ఎన్ సీఏలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో బౌలర్ వేసిన బంతి ఇషాన్ తలను బలంగా తాకింది. దాంతో అతడు మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఎన్ సీఏలో తన ఫిట్ నెస్ ను నిరూపించుకునే పనిలో ఉన్నాడు.  ఇక శ్రీలంకపై టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా, టీమిండియా సారథి రోహిత్ శర్మలు త్వరలోనే ముంబై ఇండియన్స్ క్యాంప్ లో చేరనున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, IPL, IPL 2022, Mumbai Indians

తదుపరి వార్తలు