ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి మ్యాచ్ మ్యాచుకీ దారుణంగా మారుతోంది. ఆ జట్టు గెలవడమే గగనంగా మారిపోయింది.ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్ ఒక్క విజయం సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఆడిన ఆరు మ్యాచుల్లో ఓడి.. పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది. ఈ మ్యాచు ద్వారా విజయం సాధించి పాయింట్ల టేబుల్ లో ఖాతా తెరవాలని భావిస్తోంది రోహిత్ సేన. అయితే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Temdulkar) తనయుడు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ అర్జున్ టెండూల్కర్ (Ardjun Tendulkar) ఐపీఎల్‌లోకి ఎప్పుడు అరంగేట్రం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అర్జున్ గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది వేలంలో ముంబై దానిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గత కొన్ని రోజులుగా అర్జున్ అరంగేట్రం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ వీడియో వైరలవుతుంది. ఇందులో అతను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రూ15.25 కోట్ల ఆటగాడు ఇషాన్ కిషన్‌ను ఖచ్చితమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు లక్ష్యం గురితప్పలేదంటే అది అర్జునే అంటూ ముంబై ఇండియన్స్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.
ఇది కూడా చదవండి : రోహిత్, బుమ్రాలకు అరుదైన గౌరవం.. పాపం, కోహ్లీకి తప్పని నిరాశ..!
IPL 2022 వేలంలో అత్యధిక ధర పలికిన ఇషాన్ కిషన్, అర్జున్ యార్కర్ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇషాన్ బ్యాట్‌ని గ్రౌండ్‌కి తీసుకురావడానికి ముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో, యార్కర్ ఎబిలిటీ ఉన్న అర్జున్ ను తుది జట్టులోకి తీసుకోవాలని ముంబై ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
You ain't missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
మరోవైపు ముంబై ఇండియన్స్‌లో జస్ప్రీత్ బుమ్రా మినహా అంతా విఫలమవుతున్నారు. డానియల్ సామ్స్ మూడు మ్యాచ్‌లకే పరిమితమవ్వగా.. టైమిల్ మిల్స్ ధారళంగా పరుగులిస్తున్నాడు. జయదేవ్ ఉనాద్కత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ టెండూల్కర్‌కు ఓ అవకాశం ఇవ్వాలని ముంబై ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి, తుది జట్టులో అర్జున్ కి చోటు దక్కుతుందో లేదో కొద్ది గంటల్లో తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Tendulkar, Cricket, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Sachin Tendulkar