హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఐపీఎల్ ముందర వివాదం.. ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై కర్రలతో దాడి చేసిన ఆ పార్టీ కార్యకర్తలు

IPL 2022: ఐపీఎల్ ముందర వివాదం.. ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై కర్రలతో దాడి చేసిన ఆ పార్టీ కార్యకర్తలు

ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి చేస్తోన్న వ్యక్తి

ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి చేస్తోన్న వ్యక్తి

IPL 2022: ఐపీఎల్ లో అలజడి రేగింది. అన్నీ సవ్యంగా సాగుతున్నాయన్న తరుణంలో మంగళవారం జరిగిన ఘటన టోర్నీపై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ముంబై లోని తాజ్ హోటల్ దగ్గర పార్క్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) బస్సుపై కొందరు దుండగులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఎందుకు చేశారో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ మరికొన్ని రోజుల్లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈసారి లీగ్ మొత్తాన్ని మహారాష్ట్ర (Maharashtra)లోని నాలుగు వేదికల్లో నిర్వహించేలా బీసీసీఐ (BCCI) చర్యలు తీసుకుంది. ఈ మేరకు ముంబై (Mumbai)లోని విఖ్యాత వాంఖడే, డీవై పాటిల్  స్టేడియం, బ్రబోర్న్ లతో పాటు పుణెలోని ఎంసీఏ మైదానాన్ని ఎంపిక చేశారు. ఈ నాలుగు స్టేడియాల్లో 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నెల 26న లీగ్ ఘనంగా ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే జట్లన్నీ కూడా ముంబై చేరుకున్నాయి. అన్నీ సవ్యంగా సాగుతున్నాయన్న తరుణంలో ఓ అలజడి రేగింది. ముంబై లోని తాజ్ హోటల్ దగ్గర పార్క్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) బస్సుపై కొందరు దుండగులు మంగళవారం రాత్రి దాడి చేశారు.

మంగళవారం రాత్రి ఐపీఎల్ లో అలజడి చెలరేగింది. ముంబైలోని తాజ్ హోటల్ దగ్గర పార్క్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు దాడి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన బస్సుపై ఈ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు.  రోడ్డు పక్కన తాజ్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసిన బస్సుపై మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేనకు చెందిన ఐదు నుంచి ఆరుగురు కార్యకర్తలు బస్సును ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఐపీసీ 143, 147, 149,  427 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటగాళ్లను మైదానం నుంచి హోటల్ కు అలాగే హోటల్ నుంచి మైదానానికి తరలించేందుకు ప్రతి టీం కూడా బస్సులను ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ బస్సుల విషయంలో ఢిల్లీకి చెందిన ఓ ట్రావెల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు  అవసరమైన బస్సులను  ఆ ట్రావెల్స్ సంస్థ చూసుకోనుంది. అయితే మహారాష్ట్రలో మ్యాచ్ లు జరుగుతుంటే బస్సుల కాంట్రాక్టు ఇక్కడి ట్రావెల్స్ కే ఇవ్వాలని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన డిమాండ్ చేస్తోంది. లోకల్స్ కు ప్రయారిటీ ఇవ్వాలని కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అలా ఇవ్వనందుకు ఆ జట్టు బస్సుపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Bcci, Delhi Capitals, IPL, IPL 2022, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు