IPL 2022 MI VS SRH LIVE SCORES SUNRISERS HYDERABAD PUT FIGHTING TOTAL AGAINST MUMBAI INDIANS SJN
SRH vs MI : దంచి కొట్టిన త్రిపాఠి, పూరన్.. ముంబై ముందు భారీ టోటల్ సెట్ చేసిన సన్ రైజర్స్.. ఎంతంటే?
రాహుల్ త్రిపాఠి (PC : IPL)
SRH vs MI : ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సత్తా చాటింది. మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది.
SRH vs MI : ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సత్తా చాటింది. మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. దాంతో ముంబై ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడే స్కోరును ఉంచగలిగింది. ముంబై బౌలర్లలో రమణ్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ (9) రూపంలో తొలి వికెట్ ను తొందరగానే కోల్పోయింది. అయితే సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ప్రియమ్ గార్గ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. త్రిపాఠితో కలిసి సన్ రైజర్స్ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. వీరిద్దరు రెండో వికెట్ కు 78 పరుగులు జోడించాడు. అర్ధ సెంచరీ చేసేలా కనిపించిన గార్గ్ పెవలియన్ కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. త్రిపాఠి, పూరన్ భారీ షాట్లతో సిక్సర్లు, ఫోర్లు రాబట్టారు. దాంతో సన్ రైజర్స్ 200 మార్కును ఈజీగా దాటేలా కనిపించింది. అయితే మార్కండే పట్టిన అద్భుత క్యాచ్ కు పూరన్ పెవిలియన్ కు చేరాడు. మరికాసేపటికే త్రిపాఠి, మార్క్ రమ్ (2) పెవిలియన్ కు చేరారు. చివర్లో విలియమ్సన్ (8), వాషింగ్టన్ సుందర్ (9)లు ధాటిగా ఆడలేకపోవడంతో సన్ రైజర్స్ 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. చివరి 3 ఓవర్లలో సన్ రైజర్స్ కేవలం 20 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.