Home /News /sports /

IPL 2022 MI VS SRH LIVE SCORES SUNRISERS HYDERABAD BEAT MUMBAI INDIANS BY 3 RUNS SJN

SRH vs MI : టిమ్ డేవిడ్ భయపెట్టినా.. థ్రిల్లింగ్ విక్టరీ సొంతం చేసుకున్న సన్ రైజర్స్.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

భువనేశ్వర్ కుమార్, విలియమ్సన్  (PC : IPL)

భువనేశ్వర్ కుమార్, విలియమ్సన్ (PC : IPL)

SRH vs MI : ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సమష్టి ప్రదర్శన చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...
SRH vs MI : ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సమష్టి ప్రదర్శన చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. దాంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ ల ో విజయం సాధించడంతో గత ఐదు మ్యాచ్ ల్లో ఎదురైన ఐదు వరుస ఓటములకు సన్ రైజర్స్ బ్రేక్ వేయగలిగింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్సర్లు),  ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో రాణించాడు.

భారీ టార్గెట్ తో ఛేజింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు శుభారంభం చేశారు. వీరిద్దరు ధాటిగా ఆడటంతో ముంబై స్కోరు బోర్డు రాకెట్ వేగంతో ముందుకు సాగింది. ముఖ్యంగా రోహిత్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు.  వీరిద్దరూ 10.4 ఓవర్లలో 95 పరుగులు జోడించారు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ పెవలియన్ కు చేరాడు. కాసేపటికే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ (8), డానియెల్ స్యామ్స్ (15) వికెట్లను ఉమ్రాన్ మాలిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ముంబై జట్టు కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. నటరాజన్ వేసిన 18వ ఓవర్ లో అయితే హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే ఆఖరి బంతికి అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో ముంబై ఇండియన్స్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్ వేయడానికి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. ఆ ఓవర్ లో ఒక్క పరుగు ఇవ్వకుండానే వికెట్ తీశాడు. ఇక చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా రమణ్ దీప్ సింగ్ కేవలం 15 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. దాంతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది.



అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. దాంతో ముంబై ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడే స్కోరును ఉంచగలిగింది. ముంబై బౌలర్లలో రమణ్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Jasprit Bumrah, Kane Williamson, Mumbai Indians, Rohit sharma, SRH, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు