IPL 2022 MI VS SRH LIVE SCORES MUMBAI INDIANS WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN
MI vs SRH : కీలక పోరులో టాస్ ఓడిన సన్ రైజర్స్.. రెండు మార్పులతో ముంబై.. ఓపెనర్ గా తప్పుకున్న కేన్ మామ
రోహిత్ వర్సెస్ విలియమ్సన్ (PC : IPL)
MI vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా వాంఖడే వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది.
MI vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా వాంఖడే వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు దూరమైన రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై జట్టు ఎటువంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుంది. మరోవైపు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో సన్ రైజర్స్ బరిలోకి దిగనుంది. కీలక పోరులో టాస్ నెగ్గిన కేన్ విలియమ్సన్ (Kane Williamson) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్లు రెండు మార్పలతో బరిలోకి దిగాయి.
ఓపెనర్ గా విఫలమవుతూ ఆరెంజ్ ఆర్మీతో పాటు క్రికెట్ విశ్లేషకులతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేన్ విలియమ్సన్ తుది జట్టులో ఉన్నా.. ఓపెనర్ గా మాత్రం రావడం లేదు. ప్రియమ్ గార్గ్ ను అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ కు పంపుతామని అతడు టాస్ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్ లను తప్పించిన సన్ రైజర్స్ వారి స్థానాల్లో ప్రియమ్ గార్గ్, ఫరూఖీలను తీసుకుంది. ఈ మ్యాచ్ ల ో విజయం సాధిస్తేనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. లేదంటే ఈ మ్యాచ్ తోనే సన్ రైజర్స్ నాకౌట్ ఆశలకు తెరపడుతుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పకున్న ముంబై ఇండియన్స్ గత రెండు మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించి దూకుడు మీద కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం సోకీన్, కుమార్ కార్తికేయలను పక్కన పెట్టిన ఆ జట్టు వారి స్థానాల్లో మయాంక్ మార్కండే, సంజయ్ యాదవ్ లను తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.