IPL 2022 MI VS RR LIVE SCORE UPDATES RAJASTHAN ROYALS SETS HUGE TARGET ON SCORE BOARD WITH THE HELP OF JOS BUTTLER AND HETMYER HEROICS SRD
IPL 2022 - MI vs RR : అట్లుంటది బట్లర్ మామతోని.. దంచికొట్టాడు.. ముంబై ముందు భారీ టార్గెట్..
Photo Credit : IPL Twitter
IPL 2022 MI vs RR : ఇదేం బాదుడు సామీ.. జాస్ బట్లర్ మాస్, క్లాస్ బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్ లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ రాజసం అంటే ఏంటో చూపించింది. జాస్ బట్లర్ మాస్ బాదుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది రాజస్థాన్ రాయల్స్. జాస్ బట్లర్ (68 బంతుల్లో 100 పరుగులు ; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), హెట్ మేయర్ (14 బంతుల్లో 35 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్ ( 21 బంతుల్లో 30 పరుగులు ; 1 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఈ విధ్వంసంలో కూడా జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. టైల్ మిల్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 2 పరుగులు మాత్రమే జైస్వాల్.. బుమ్రా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో, 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్. అయితే, పవర్ ప్లేలో జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. జాస్ బట్లర్ మాత్రం తన క్లాస్ అండ్ మాస్ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
అయితే, 48 పరుగులు వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పడిక్కల్.. టైమిల్ మిల్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, ఆ తర్వాత జాస్ బట్లర్ తో కలిసిన కెప్టెన్ సంజూ శాంసన్ కూడా మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్దరూ బౌలర్ ఎవరని చూడకుండా వీరబాదుడు బాదారు. ఈ క్రమంలో జాస్ బట్లర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ సిక్సర్ల వర్షం కురిపించారు. అయితే, దూకుడు మీదున్న ఈ జోడికి పొలార్డ్ బ్రేకులు వేశాడు.130 పరుగులు వద్ద రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో వికెట్ కు 82 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
Innings Break!
A brilliant 100 from @josbuttler and quick-fire knocks of 35 and 30 from Hetmyer and Samson, propel #RR to a total of 193/8 on the board.
అయితే, ఆ తర్వాత వచ్చిన షిమ్రోన్ హెట్ మేయర్ విధ్వంసం అంటే ఏంటో ముంబై బౌలర్లకు చూపాడు. హెట్ మేయర్ కేవలం 14 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయ్. జోస్ బట్లర్ తో కలిసి నాలుగో వికెట్ కు 53 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో జాస్ బట్లర్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జాస్ బట్లర్ కి ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. అయితే, జోరు మీదున్న హెట్ మేయర్, బట్లర్ ని జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు.
హెడ్ టు హెడ్ రికార్డులు
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా 13 మ్యాచ్‌ల్లో ముంబై, 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.