హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - MI vs RR : ప్చ్.. ముంబైకి మరోసారి నిరాశే.. ఆ స్టార్ బ్యాటర్ దూరం.. టాస్ గెలిచిన రోహిత్ సేన..

IPL 2022 - MI vs RR : ప్చ్.. ముంబైకి మరోసారి నిరాశే.. ఆ స్టార్ బ్యాటర్ దూరం.. టాస్ గెలిచిన రోహిత్ సేన..

IPL 2022 - MI vs RR

IPL 2022 - MI vs RR

IPL 2022 MI vs RR : హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా 13 మ్యాచ్‌ల్లో ముంబై, 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వడానికి రెడీ అయింది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తోన్న ముంబై ఇండియన్స్‌ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. ఇక, ఈ మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ ను ఈ మ్యాచులో కూడా అందుబాటులో లేడు. ఫస్ట్ మ్యాచు ఆడిన సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగుతోంది ముంబై ఇండియన్స్. ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడ్డ నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో యంగ్ పేసర్ నవదీప్ షైనీకి తుది జట్టులో చోటు కల్పించింది.తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోహిత్ సేన స్థానం 9. కింది నుంచి రెండో స్థానంలో నిలిచిందీ టీమ్. దీంతో, ఈ మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి.. తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించి.. ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. ఇదే దూకుడు ఈ మ్యాచులో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తోంది రాజస్థాన్.

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు, తిలక్ వర్మ, కీరన్ పొల్లార్డ్ ఎలాగూ ఉండనే ఉన్నారు. ఆల్‌రౌండర్లలో టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, టైనల్ మిల్స్, బాసిల్ థంపీ రాజస్థాన్ రాయల్స్‌పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.

మరోవైపు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శామ్సన్, యశస్వి జైస్వాల్ లతో చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్ వంటి టాప్ క్లాస్ బౌలర్లు రాజస్థాన్ సొంతం. ఇలాంటి స్ట్రాంగ్ టీమ్ ను ముంబై ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.

హెడ్ టు హెడ్ రికార్డులు

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా 13 మ్యాచ్‌ల్లో ముంబై, 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

తుది జట్లు :

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ షైనీ యుజ్వేంద్ర చహల్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమాల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

First published:

Tags: IPL 2022, Mumbai Indians, Rajasthan Royals, Rohit sharma, Sanju Samson

ఉత్తమ కథలు