IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో నేడు అద్భుతం చోటు చేసుకునే అవకాశాలు కనపిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వారసుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అర్జున్ ను టెండూల్కర్ ను నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఆడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే గనుక జరిగితే సచిన్ టెండూల్కర్ వారసుడి హోదాలో అర్జున్ టెండూల్కర్ ఓ పెద్ద లీగ్ లో ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్ ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ డానిల్ సామ్స్ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. కమిన్ ధాటికి ఒకే ఓవర్లో ఏకంగా 35 పరుగులు సమర్పించుకుని ముంబై ఓటమికి కారకుడయ్యాడు. దాంతో సామ్స్ పై వేటు ఖాయం అని తెలిసింది. అయితే అతడి స్థానంలో ఫాబియాన్ అలెన్ కంటే కూడా అర్జున్ టెండూల్కర్ నే తీసుకోవాలని ముంబై ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై జట్టులో మరోసారి మన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కీలకం కానున్నాడు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ లు ముంబై బ్యాటింగ్ కు వెన్నెముకలా ఉన్నారు. రోహిత్ శర్మ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అయితే అతడు ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అర్జున్ టెండూల్కర్ మీడియం పేస్ తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అయితే తండ్రి సచిన్ లా అర్జున్ రైట్ హ్యాండెట్ బ్యాటర్ కాదు. లెఫ్టాండ్ బ్యాటర్. ఏదీ ఏమైనా అర్జున్ అరంగేట్రం చేస్తే సరిపోదు. రాణిస్తేనే జట్టులో స్థానం సుస్థిరం అవుతుంది.
ఇక మరో పక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాలా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా జట్టులోకి రానున్నాడు. దాంతో ఆ జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. రూథర్ ఫోర్డ్ స్థానంలో మ్యాక్సీ తుది జట్టులో చేరే అవకాశం ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, మ్యాక్స్ వెల్ లతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ లో సిరాజ్, హర్షల్ పటేల్ ఉండనే ఉన్నారు. పుణేలోని ఎంసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఏ రకంగా చూసిన ఆరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ ఫ్యాన్స్ కు విందు భోజనం పెట్టేలా కనిపిస్తోంది.
తుది జట్ల అంచనా
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డివాల్డ్ బ్రేవీస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, అర్జున్ టెండూల్కర్/ ఫాబియన్ అలెన్, బుమ్రా, మిల్స్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, విల్లే, హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Royal Challengers Bangalore, Sachin Tendulkar, Virat kohli