హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - MI vs RCB : టాస్ గెలిచిన RCB.. బెంగళూరులోకి కొత్త అల్లుడు.. రెండు మార్పులు చేసిన ముంబై..

IPL 2022 - MI vs RCB : టాస్ గెలిచిన RCB.. బెంగళూరులోకి కొత్త అల్లుడు.. రెండు మార్పులు చేసిన ముంబై..

IPL 2022 - MI vs RCB

IPL 2022 - MI vs RCB

IPL 2022 - MI vs RCB : ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ముంబై నెగ్గాలంటే సమష్టిగా రాణించాల్సివుంది. మరో వైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు నెగ్గిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది.

ఐపీఎల్ 2022లో మరికాసేపట్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై జట్టు.. డుప్లెసిస్‌ సారథ్యంలోని బెంగళూరును ఢీకొంటుంది. ముంబై జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు విజయాన్నందుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ముంబై నెగ్గాలంటే సమష్టిగా రాణించాల్సివుంది. మరో వైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు నెగ్గిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రూథర్ ఫోర్డ్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి వచ్చాడు. ఇక, ముంబై జట్టు రెండు మార్పులు చేసింది. టైమల్ మిల్స్ ప్లేసులో జైదేవ్ ఉనాద్కత్, డానియల్ సామ్స్ స్థానంలో రమణదీప్ ను జట్టులోకి తీసుకుంది.

ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ ఫామ్‌ను అందుకోవడం ఆ జట్టుకు చాలా అవసరం. అయితే ఇషాన్‌ కిషన్‌ మంచి ఫామ్‌లో ఉండడం, యువ ఆటగాడు తిలక్‌ వర్మ సత్తా చాటుటుండడం ముంబయికి సానుకూలాంశాలు. వీరితో సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ లు ముంబై బ్యాటింగ్ కు వెన్నెముకలా ఉన్నారు. రోహిత్ శర్మ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తోంది.

అయితే అతడు ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముంబై బ్యాటింగ్ ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు రాణించే మరో బౌలర్ కరువయ్యాడు. టైమల్ మిల్స్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో, అతనిస్థానంలో జై దేవ్ ఉనద్కత్ ను జట్టులోకి తీసుకుంది. లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ అద్భుతంగా రాణిస్తే ముంబై కష్టాలు తీరినట్టే.

మరో పక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాలా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా జట్టులోకి రానున్నాడు. దాంతో ఆ జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. రూథర్ ఫోర్డ్ స్థానంలో మ్యాక్సీ తుది జట్టులో చేరే అవకాశం ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, మ్యాక్స్ వెల్ లతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ లో సిరాజ్, హర్షల్ పటేల్ ఉండనే ఉన్నారు. పుణేలోని ఎంసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఏ రకంగా చూసిన ఆరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ ఫ్యాన్స్ కు విందు భోజనం పెట్టేలా కనిపిస్తోంది.

తుది జట్లు :

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డివాల్డ్ బ్రేవీస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జై దేవ్ ఉనద్కత్, బుమ్రా, రమణదీప్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, విల్లే, హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

First published:

Tags: Faf duplessis, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు