పూణె వేదికగా జరిగిన మ్యాచులో ముంబైపై ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ ను ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది ఆర్సీబీ. దీంతో ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఆర్సీబీకి ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. ముంబైకి వరుసగా నాలుగో పరాజయం. అనూజ్ రావత్ ( 47 బంతుల్లో 66 పరుగులు ; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ( 36 బంతుల్లో 48 పరుగులు ; 5 ఫోర్లు) రాణించాడు. ముంబై బౌలర్లో జై దేవ్ ఉనాద్కత్, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మిగతా బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి ఆరంభం దక్కింది. ఆర్సీబీ ఓపెనర్లు ఇద్దరూ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలుపెట్టారు. ఫాఫ్ డుప్లెసిస్ ఆచిచూచి ఆడితే.. మరో యంగ్ ఓపెనర్ అనూజ్ రావత్ మాత్రం తన బ్యాట్ కు పనిచెప్పాడు. ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల ఫార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే సేమ్ టు సేమ్ ముంబై మాదిరే 50 పరుగుల తర్వాత ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయింది.
ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 16 పరుగులు చేసి ఉనాద్కట్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ.. అనూజ్ రావత్ తో కలిసి దూకుడు పెంచాడు. ముఖ్యంగా బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ లను టార్గెట్ చేసుకుని ఈ ఇద్దరూ చెలరేగాడు. దీంతో, స్కోర్ బోర్డు ప్రెజర్ లేకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో 38 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ యంగ్ గన్ కి ఇదే తొలి హాఫ్ సెంచరీ.
అయితే, విరాట్ కోహ్లీ రూపంలో ఛాన్స్ వచ్చినా ముంబై సద్వినియోగం చేసుకోలేకపోయింది. థంపి బౌలింగ్ లో విరాట్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను డెవాల్డ్ బ్రెవిస్ వదిలేశాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత దూకుడు పెంచిన కోహ్లీ, అనూజ్.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, ఆఖర్లో 66 పరుగులు చేసిన అనూజ్ రనౌట్ అయ్యాడు. 8 పరుగులు చేయాల్సన సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత మ్యాక్సీ రెండు షాట్లతో ఆర్సీబీకి విక్టరీ అందించాడు.
ఇక, అంతకు ముందు సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో వికట్ల 6 నష్టానికి 151 పరుగులు చేసింది. అందరూ విఫలమైన చోట సూర్యకుమార్ యాదవ్ మెరిశాడు. ఓ దశలో ముంబై 100 పరుగులు కూడా చేసేలా కన్పించలేదు. సూర్య కుమార్ యాదవ్ ( 37 బంతుల్లో 68 పరుగులు ; 5 ఫోర్లు,6 సిక్సర్లు ) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ( 15 బంతుల్లో 26 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హసరంగా, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Royal Challengers Bangalore, Virat kohli