హోమ్ /వార్తలు /sports /

IPL 2022 - MI vs RCB : వాటే బ్యాటింగ్.. మళ్లీ ముంబై హీరో సూర్యనే.. ఆర్సీబీ ముందు సాధారణ లక్ష్యం..

IPL 2022 - MI vs RCB : వాటే బ్యాటింగ్.. మళ్లీ ముంబై హీరో సూర్యనే.. ఆర్సీబీ ముందు సాధారణ లక్ష్యం..

IPL 2022 - MI vs RCB : ముంబై ఇండియన్స్ మరోసారి నిరాశపర్చింది. అయితే, సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై పాలిట హీరోగా నిలిచాడు.

IPL 2022 - MI vs RCB : ముంబై ఇండియన్స్ మరోసారి నిరాశపర్చింది. అయితే, సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై పాలిట హీరోగా నిలిచాడు.

IPL 2022 - MI vs RCB : ముంబై ఇండియన్స్ మరోసారి నిరాశపర్చింది. అయితే, సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై పాలిట హీరోగా నిలిచాడు.

  పుణె వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో ముంబై సాధారణ స్కోరుకు పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో వికట్ల 6 నష్టానికి 151 పరుగులు చేసింది. మరోసారి ముంబై ఇండియన్స్ ను సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. ఓ దశలో ముంబై 100 పరుగులు కూడా చేసేలా కన్పించలేదు. సూర్య కుమార్ యాదవ్ ( 37 బంతుల్లో 68 పరుగులు ; 5 ఫోర్లు,6 సిక్సర్లు ) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ( 15 బంతుల్లో 26 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హసరంగా, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్‌ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ మంచి క్లాసిక్ షాట్లతో అలరించాడు. ఇషాన్ కిషన్ కూడా చెత్త బంతుల్ని బౌండరీలు తరలించాడు.

  దీంతో ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే. .మరో సారి భారీ స్కోరు చేయడంలో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. 15 బంతుల్లో రోహిత్‌ 26 పరుగులు చేసి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రోహిత్ ఔటైన తర్వాత ముంబై ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది.

  ఏదో పని ఉందన్నట్టు.. ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. 'జూనియర్‌ ఏబీ' డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఆకట్టుకోలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక, ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా 28 బంతుల్లో 26 పరుగులు చేసిన ఆకాశ్ దీప్ బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

  ఆ తర్వాత వచ్చిన తిలక్‌ వర్మను మ్యాక్స్‌వెల్‌ రూపంలో దురదృష్టం వెంటాడింది. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయిన తిలక్‌ వర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక, ఆదుకోవాల్సిన పొలార్డ్ కూడా గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. హసరంగా బౌలింగ్‌లో పొలార్డ్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో, 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది.

  ఇక, ఆ తర్వాత వచ్చిన రమణ్ దీప్ సింగ్ కూడా ఆకట్టులేకపోయాడు. కేవలం 6 పరుగులు చేసిన రమణ్ దీప్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఓ వైపు వికెట్లు పడుతున్నా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చెత్త బంతుల్ని సిక్సర్లు, ఫోర్లు తరలించి ముంబైకు మంచి స్కోరు అందించాడు. సూర్యకు జైదేవ్ ఉనాద్కత్ సహకరించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్.

  తుది జట్లు :

  ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డివాల్డ్ బ్రేవీస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జై దేవ్ ఉనద్కత్, బుమ్రా, రమణదీప్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్

  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, విల్లే, హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

  First published:

  ఉత్తమ కథలు