IPL 2022 MI VS PBKS LIVE SCORE UPDATES PUNJAB KINGS WON BY 12 RUNS SRD
IPL 2022 - MI vs PBKS : ప్చ్.. ముంబైకి తప్పని నిరాశ.. వరుసగా ఐదో ఓటమి.. పంజాబ్ సూపర్ విక్టరీ..
Photo Credit : IPL Twitter
IPL 2022 - MI vs PBKS : అయ్యో.. ఈ సీజన్ లో ముంబై పరిస్థితి మ్యాచ్ మ్యాచుకి దారుణంగా మారుతోంది. ఆ జట్టుకు విజయం ఎండమావిలా మారింది. ఈ సీజన్ లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది రోహిత్ సేన.
పుణె వేదికగా జరిగిన పోరులో పంజాబ్ చేతిలో ముంబై ఓటమి పాలైంది. దీంతో, ఈ సీజన్ లో వరుసగా ఐదో పరాజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో, 12 పరుగుల తేడాతో ఓడిపోయింది రోహిత్ సేన. ముంబై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 49 పరుగులు ; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (30 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు) , తిలక్ వర్మ ( 20 బంతుల్లో 36 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. రబాడా రెండు వికెట్లు తీశాడు. దీంతో, ఈ సీజన్ లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టకుంది రోహిత్ సేన. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు స్టార్ట్ అందించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అద్భుతమైన షాట్లతో అలరించాడు.
అయితే, ఊపు మీదున్న రోహిత్ శర్మ జోరుకు రబాడా బ్రేకులు వేశాడు. 4వ ఓవర్లో రబాడ బౌలింగ్లో రోహిత్ శర్మ(28)ఔట్ అయ్యాడు. వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, మరుసటి ఓవర్లో ఇషాన్ కిషన్(3) పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో, 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ముంబై. కష్టాల్లో పడ్డ ముంబై ఇన్నింగ్స్ ని డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ ఆదుకున్నారు. మీసాలు కూడా రాని కుర్రాళ్లు అద్భుతమైన షాట్లతో అలరించారు.
ముఖ్యంగా డెవాల్డ్ రాహుల్ చాహర్ వేసిన 8 వ ఓవర్ లో నాలుగు సిక్సర్లు, ఫోర్ తో మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో ఈ యంగ్ క్రికెటర్లు 50 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, అంతా ఓకే అనుకుంటున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో ముంబై మరో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన బ్రెవిస్.. ఓడియన్ స్మిత్ బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో, మూడో వికెట్ కు 84 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత మంచి టచ్ లో ఉన్న తెలుగు తేజం తిలక్ వర్మ(36) సూర్యకుమార్ తో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. దీంతో, 131 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పొలార్డ్ కూడా రనౌటయ్యాడు. పది పరుగులు చేసిన పొలార్డ్ అనవసరపు రనౌట్ కు యత్నించి ముంబైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత సూర్య (43) ఔటవ్వడంతో ముంబై ఓటమి ఖరారు అయింది.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మెరిశారు. శిఖర్ ధావన్ ( 50 బంతుల్లో 70 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (32 బంతుల్లో 52 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలకు తోడుగా ఆఖర్లో జితేష్ శర్మ ( బంతుల్లో పరుగులు ; ఫోర్లు, సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ముంబై ముందు భారీ టోటల్ సెట్ చేసింది. ముంబై బౌలర్లలో థంపి రెండు వికెట్లు దక్కించుకోగా.. బుమ్రా, అశ్విన్, జై దేవ్ ఉనాద్కత్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.