Home /News /sports /

IPL 2022 MI VS PBKS LIVE SCORE UPDATES PUNJAB KINGS SETS HUGE TOTAL ON SCORE BOARD SRD

IPL 2022 - MI vs PBKS : దంచికొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్..

Punjab Kings (IPL Twitter)

Punjab Kings (IPL Twitter)

IPL 2022 MI vs PBKS live score Updates Punjab Kings Sets Huge Total on Score Board srd - IPL 2022 - MI vs PBKS : ముఖాముఖి పోరులో ఇరు జట్లు 28 సార్లు తలపడ్డాయ్. ఇందులో 15 సార్లు ముంబై ఇండియన్స్ విజయకేతనం ఎగురవేయగా.. 13 సార్లు పంజాబ్ కింగ్స్ నెగ్గింది.

ఇంకా చదవండి ...
    పుణె వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న పోరులో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మెరిశారు. శిఖర్ ధావన్ ( 50 బంతుల్లో 70 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (32 బంతుల్లో 52 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలకు తోడుగా ఆఖర్లో జితేష్ శర్మ ( బంతుల్లో పరుగులు ; ఫోర్లు, సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ముంబై ముందు భారీ టోటల్ సెట్ చేసింది. ముంబై బౌలర్లలో థంపి రెండు వికెట్లు దక్కించుకోగా.. బుమ్రా, అశ్విన్, జై దేవ్ ఉనాద్కత్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా ఫామ్ లో లేని మయాంక్ అగర్వాల్ ముంబై బౌలర్లను టార్గెట్ చేసుకుని దూకుడుగా ఆడాడు. దీంతో, 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ దూకుడుగా తోడుగా.. శిఖర్ ధావన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. వీలు చిక్కినప్పుడల్లా ధావన్ కూడా బౌండరీలు బాదాడు.

    ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, హాఫ్ సెంచరీ చేసిన వెంటనే మయాంక్ పెవిలియన్ బాట పట్టాడు.మయాంక్‌ అగర్వాల్‌(52) రూపంలో పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

    దీంతో.. 97 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్. ఆ తర్వాత 12 పరుగులు చేసిన బెయిర్‌ స్టో ఉనాద్కట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అవ్వడంతో పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే, మరోవైపు గబ్బర్ తన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

    అయితే, సూపర్ ఫామ్ లో ఉన్న లివింగ్ స్టోన్ (2) బుమ్రా సూపర్ యార్కర్ కు ఔటై.. పెవిలియన్ బాట పట్టాడు. దీంతో, 130 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. ఇక, హాఫ్ సెంచరీ తర్వాత శిఖర్ మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.

    అయితే, దూకుడు మీదున్న గబ్బర్ జోరుకు బాసిల్ థంపి బ్రేకులు వేశాడు. థంపి బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి.. పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, 18 వ ఓవర్ లో జితేష్ మెరుపులు మెరిపించాడు. ఉనాద్కత్ వేసిన ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు యంగ్ బ్యాటర్. ఆ తర్వాత జితేష్ కి షారుఖ్ కూడా తోడవ్వడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది.

    తుది జట్లు
    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, జై దేవ్ ఉనాద్కత్, టైమిల్ మిల్స్, బాసిల్ థంపి

    పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, జితేష్ శర్మ, షారూఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, కగిసో రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Punjab kings, Rohit sharma, Shikhar Dhawan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు