IPL 2022 MI VS PBKS LIVE SCORE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IPL 2022 - MI vs PBKS : టాస్ గెలిచిన ముంబై.. కీలక మార్పుతో బరిలోకి రోహిత్ సేన..
IPL 2022 - MI vs PBKS
IPL 2022 - MI vs PBKS : ముఖాముఖి పోరులో ఇరు జట్లు 28 సార్లు తలపడ్డాయ్. ఇందులో 15 సార్లు ముంబై ఇండియన్స్ విజయకేతనం ఎగురవేయగా.. 13 సార్లు పంజాబ్ కింగ్స్ నెగ్గింది.
ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు మరి కాసేపట్లో తెరలేవనుంది. వరుసగా నాలుగు పరాజయాలతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ (MI vs PBKS)తో అమీతుమీ తేల్చుకోనుంది. పుణేలోని మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఎంసీఏ)లో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ముంబై. ఇక, ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రమణ్ దీప్ స్థానంలో టైమల్ మిల్స్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఇక, పంజాబ్ కింగ్స్ అదే టీమ్ తో బరిలోకి దిగుతోంది. నాలుగు వరుస ఓటములతో పదో స్థానికి పడిపోయిన ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని ఉవ్విల్లూరుతోంది. మరోవైపు గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి రెండు బంతులకు రెండు సిక్స్‌లు ఇచ్చుకొని మూల్యం చెల్లించుకున్న పంజాబ్ కింగ్స్ మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో, ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.
సీజన్లో ఇప్పటి వరకు ఖాతా తెరవని ముంబై తొలి విజయం కోసం ఆరాటపడుతోంది. ఓటముల ట్రెండ్‌ను మార్చాలని పట్టుదలతో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి నాలుగు వరుస ఓటములు పీడకలగానే చెప్పుకోవచ్చు. అయితే.. ఈ లీగ్‌ను నెమ్మదిగా ప్రారంభించి చివరకు కప్పు ఎగరేసుకుపోతుందనే పేరుంది. దానిని మళ్లీ రిపీట్ చేస్తుందని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సీజన్లుగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబయి ఈ సీజన్‌ను అత్యంత పేలవంగా ప్రారంభించింది.
ముంబై బ్యాటర్లు పెద్ద స్కోర్లు సాధించటంలో విఫలమవుతున్నారు.గత మ్యాచ్‌లో ఒక్క సూర్యకుమార్ తప్ప ఎవ్వరూ రాణించలేకపోయారు. మరోవైపు.. బౌలింగ్ విభాగం సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గత మ్యాచుల్లో ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్యాట్ ఝుళిపించి జట్టును విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నాడు. టాప్ఆర్డర్లో రోహిత్ శర్మ కీలకం. అలాగే.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు సైతం రాణిస్తేనే జట్టుకు పెద్ద స్కోర్ వస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్.. ఫామ్‌లో లేకపోవటం జట్టును కలవరపెడుతోంది.
ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది పంజాబ్ కింగ్స్. అయితే.. తర్వాత జరిగిన మూడింటిలో రెండు ఓడిపోయింది. మొత్తంగా నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్, ఓపెనర్ శిఖర్ ధావన్, అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సింగిల్ డిజిట్ స్కోర్లుకే పరిమితమవుతున్నాడు. అది జట్టును ఆందోళన కలిగిస్తోంది. అయితే, లియామ్ లివింగ్ స్టోన్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ లో కగిసో రాబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ కీలకం కానున్నారు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జై దేవ్ ఉనాద్కత్, టైమిల్ మిల్స్, బాసిల్ థంపి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.