IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడనుంది. సీజన్ లో ముంబై ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ ఓడి.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్ లోనూ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి అయినట్లే. దాంతో లక్నోతో మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం కానుంది. ఇక అదే సమయంలో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి మరో రెండింటిలో ఓడిన కేఎల్ రాహుల్ (KL Rahul) నాయకత్వంలోని లక్నో జట్టు పరిస్థితి ముంబై కంటే కూడా బాగానే ఉంది.
అయితే మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. లక్నోతో మ్యాచ్ కు ముందు ముంబై ప్లేయర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొడుకు అర్జున్ టెండూల్కర్ నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. అతడి ఫోటోను ట్వీట్ చేసిన ముంబై ఇండియన్స్... LSGvsMI అని హ్యాష్ ట్యాగ్ చేసి.. ఇన్ అవర్ మైండ్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే నేటి మ్యాచ్ లో అర్జున్ ను తుది జట్టులోకి తీసుకుంటుందా అనే అనుమానాలు అటు ముంబై ఫ్యాన్స్ తో పాటు సచిన్ అభిమానుల్లోనూ నెలకొన్నాయి. వాస్తవంగా గత మ్యాచ్ లోనే అతడిని జట్టులోకి తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాలేదు.
#MIvLSG on our minds! 🧠#OneFamily #DilKholKe #MumbaiIndians #ArjunTendulkar pic.twitter.com/8X6ltPQEuf
— Mumbai Indians (@mipaltan) April 15, 2022
మరోవైపు ముంబై తుది జట్టులోకి అర్జున్ టెండూల్కర్ ను తీసుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ముంబై కు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ అర్జున్ టెండూల్కర్ ఆడితే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. జైదేవ్ ఉనాద్కట్, బాసిల్ థంపి లాంటి వారు 40 లేదా 50 పరుగులు సమర్పించుకుంటున్నా వారికి అవకాశం ఇస్తున్నప్పుడు. యంగ్ టెండూల్కర్ కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదంటూ వాదిస్తున్నారు.
Some of our pacers are giving 40-50 runs in every game & also we are missing depth in batting., So better to give him chances to perform, he is an All-Rounder who can contribute with a bat as well. 💙#ArjunTendulkar #OneFamily #Believe #MumbaiIndians
— 𝐕𝐈𝐒𝐇𝐀𝐋 🇮🇳 (@Vishal_SRT10) April 15, 2022
Please go ahead with Him..
He may create a difference as he is All rounder..
Left arm bowler chahiye bhi ek tagda..
This Mills and Thampi is creating burdern
— The Libral Hunter🇮🇳 (@Libral_Hunterr) April 15, 2022
Been waiting for this since Master retired from the game...!!! Go well champ, the game is in your genes💥#MumbaiIndians #OneFamily https://t.co/z67D06Fezh
— Murphy's Devotee (@_misfitTOY_) April 15, 2022
అర్జున్ టెండూల్కర్ మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అదే సమయంలో బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున రెండు మ్యాచ్ లు ఆడాడు. అయితే రంజీ ట్రోఫీలో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. అర్జున్ టెండూల్కర్ కు ఒక అవకాశం ఇస్తే చూడాలని ఉందంటూ సచిన్ అభిమానులు కోరుతున్నారు. మరి నేటి మ్యాచ్ లో ముంబై జట్టు ఏం చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2022, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma, Sachin Tendulkar