IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indins) ఆటతీరుపై ఎంత చర్చ జరుగుతుందో.. అదే స్థాయిలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అరంగేట్రం గురించి కూడా చర్చ జరుగుతుంది. గత మూడు మ్యాచ్ ల నుంచి కూడా అదిగో అర్జున్ కు చాన్స్ ఇస్తున్నారు.. ఇదిగో చాన్స్ ఇస్తున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో అతడిని తుది జట్టులో చేరుస్తూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రేపటి మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇది కూడా ఊహాగానాలే అని కొట్టి పారేయకండి. అర్జున్ టెండూల్కర్ ఈసారి తప్పక బరిలోకి దిగతాడని చెప్పేందుకు గట్టి ఆధారాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవేంటో చదివేద్దాం..
క్రికెట్ దేవుడి బర్త్ డే
రేపు అంటే ఏప్రిల్ 24 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు. అంటే సచిన్ పుట్టిన రోజున అతడి తనయుడు అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగనున్నాడన్నమాట. అందుకే గత మ్యాచ్ ల్లో అతడిని తుది జట్టులోకి తీసుకుంటారని వార్తలు వచ్చినా.. సరైన ముహూర్తం కోసం ఫ్రాంచైజీ వేచి చూసింది. ఇప్పుడు సచిన్ పుట్టిన రోజున అర్జున్ ను బరిలోకి దింపనున్నారు.
ఇది కూడా చదవండి : ’నీకెందుకురా.. మూస్కోని అటు పో‘ కుల్దీప్ పై చహల్ కోపం.. వైరల్ అవుతోన్న వీడియో
గత మ్యాచ్ లో ఉనాద్కట్ విఫలం
బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ రాణిస్తుండటంతో ముంబై బ్యాటింగ్ బౌలింగ్ తో పోలిస్తే బలంగానే కనిపిస్తోంది. అయితే వారి బౌలింగ్ మాత్రం దారుణంగా ఉంది. ముఖ్యంగా పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. బుమ్రా మినహా మిగిలిన వారు నిలకడ చూపడం లేదు. ఈ క్రమంలో చెన్నై తో జరిగిన గత మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వేసిన జైదేవ్ ఉనాద్కట్ 17 పరుగలు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యాడు. దాంతో ఆదివారం జరిగే మ్యాచ్ లో అతడి స్థానంలో అర్జున్ టెండూల్కర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రా, స్యామ్స్, మెరిడిత్, హృతిక్ షోకీన్ ప్రధాన బౌలర్లుగా ఉన్నారు. వీరు 16 ఓవర్లను వేస్తే.. మిగిలిన నాలుగు ఓవర్లను అర్జున్ టెండూల్కర్, కీరన్ పొలార్డ్, తిలక్ వర్మలతో వేయించే అవకాశం ఉంది. ఈ లెక్కన రేపటి మ్యాచ్ లో అర్జున్ ఆడేది ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, Jasprit Bumrah, Kieron pollard, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma, Sachin Tendulkar