IPL 2022 MI VS LSG LIVE SCORE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IPL 2022 - MI vs LSG : టాస్ గెలిచిన ముంబై.. థంపి స్థానంలో విండీస్ ఆల్ రౌండర్.. కీలక మార్పు చేసిన లక్నో..
IPL 2022 - MI vs LSG
IPL 2022 - MI vs LSG : తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌తో ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు గెలవాల్సిన మ్యాచ్‌లో అనాలోచిత నిర్ణయం కారణంగా ఓటమి చవిచూసిన లక్నో మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2022 సీజన్లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా వరుసగా ఐదు పరాజయాలతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్.. ఆల్‌రౌండర్లతో పటిష్టంగా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బాసిల్ థంపి స్థానంలో విండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక, లక్నో కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కృష్ణప్ప గౌతమ్ స్థానంలో మనీష్ పాండే తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు.తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌తో ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు గెలవాల్సిన మ్యాచ్‌లో అనాలోచిత నిర్ణయం కారణంగా ఓటమి చవిచూసిన లక్నో మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవతర్తంగా సాగనుంది.
ముంబై బ్యాటింగ్ స్ట్రాంగ్ గా కన్పిస్తున్నా.. బౌలింగ్ చాలా వీక్ గా కన్పిస్తోంది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. ఆ తర్వాత బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ చేయనున్నాడు. అతను గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. అయితే, రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. ఇషాన్ కిషన్ కూడా రూ.15.25 కోట్లకి న్యాయం చేయాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉన్నారు. తిలక్ వర్మ భారీ స్కోరు చేయాల్సిన అవసరముంది. ఫామ్ లో లేని కీరన్ పొలార్డ్ తిరిగి లయ అందుకోకపోతే కష్టమే. స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌తో పాటు ఫాబియెన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్‌లతో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.
మరోవైపు, లక్నో జట్టు పేపర్ మీద భీకరంగా ఉంది. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా సత్తా చాటుతున్నారు. మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్ వరకు వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. మార్కస్ స్టొయినిస్ బ్యాటింగ్ ఆర్డర్ పై మాత్రం కన్ఫూజ్యన్ లో ఉంది లక్నో. దుష్మంత్ చమీరాతో పాటు రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్ ఆల్ రౌండర్ల బాధ్యతల్ని పంచుకోనున్నారు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.