Home /News /sports /

IPL 2022 MI VS LSG LIVE SCORE UPDATES LUCKNOW SUPER GIANTS SETS HUGE TOTAL ON SCORE BOARD WITH KL RAHUL BRILLIANT KNOCK SRD

IPL 2022 - MI vs LSG : రాహులో రాహులా.. సూపర్ సెంచరీతో ముంబైని ఉతికారేశావురో.. రోహిత్ సేన టార్గెట్ ఎంతంటే..

KL Rahul (Photo Credit : IPL Twitter)

KL Rahul (Photo Credit : IPL Twitter)

IPL 2022 - MI vs LSG : వాటే బ్యాటింగ్.. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ తో చూస్తే ఈ మాట అనాల్సిందే. సూపర్ సెంచరీతో ఈ స్టైలిష్ బ్యాటర్ తన జట్టుకు భారీ స్కోరు అందించాడు.

    బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో లక్నో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 60 బంతుల్లో 103 పరుగులు నాటౌట్ ; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీతో తన జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఇది కేఎల్ రాహుల్ కు ఐపీఎల్ లో వందో టీ20 మ్యాచ్. కేఎల్ రాహుల్ తో పాటు మనీశ్‌ పాండే (29 బంతుల్లో 38; 6 ఫోర్లు), డికాక్‌ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. ముంబై బౌలర్లలో జై దేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లు దక్కించుకోగా.. అలెన్, మురుగన్ అశ్విన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నోకు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. పవర్ ప్లేలో ముంబై బౌలర్లను టార్గెట్ చేసుకుని కేఎల్ రాహుల్, డికాక్ దంచి కొట్టారు. దీంతో 5 ఓవర్లకే ఆ జట్టు 46 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే, దూకుడు మీదున్నడికాక్‌ను (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్‌) ముంబై డెబ్యుటెంట్‌ బౌలర్‌ ఫేబియన్‌ అలెన్‌ బోల్తా కొట్టించాడు.

    అలెన్‌ వేసిన అంతకుముందు బంతికే సిక్సర్‌ బాది జోరుమీదున్నట్లు కనిపించిన డికాక్‌ ఆ తర్వాతి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో, 52 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది లక్నో. డికాక్ ఔటైన తర్వాత కూడా లక్నో తన దూకుడు తగ్గించలేదు. రాహుల్ తో కలిసిన మనీశ్ పాండే కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 50 పరుగుల విలువైన పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ కమ్రంలో కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

    అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మురుగన్ అశ్విన్ విడదీశాడు. ధాటిగా ఆడుతున్న మనీశ్‌ పాండే (29 బంతుల్లో 38; 6 ఫోర్లు)ను మురుగన్‌ అశ్విన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో, 124 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఇక, హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ మరింత రెచ్చిపోయాడు. వరుస షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, మార్కస్ స్టొయినిస్ (9 బంతుల్లో 10 పరుగులు , 1 సిక్సర్) నిరాశపర్చాడు. ఉనాద్కత్ బౌలింగ్ లో రోహిత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, రాహుల్ మాత్రం తన జోరు ఆపలేదు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో, తన జట్టుకి భారీ స్కోరు అందించాడు.

    తుది జట్లు
    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్

    లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), మనీశ్ పాండే, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Jasprit Bumrah, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు