Home /News /sports /

IPL 2022 MI VS KKR MUMBAI INDIANS SKIPPER ROHIT SHARMA NEEDS 54 RUNS TO COMPLETE 10000 RUNS IN T20 CRICKET AND CREATE HISTORY SRD

IPL 2022 - Rohit Sharma : కమాన్ రోహిత్.. మరో 54 పరుగులే.. నీ సత్తా ఏంటో మరోసారి చూపించు...

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

IPL 2022: భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథి రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. చాలా ప్రత్యేకమైనది.

    ఇండియన్ క్రికెట్ లో రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రత్యేక స్థానం.  అటు బ్యాటింగ్ తో ప్రత్యర్థులపై శివాలెత్తడమే కాదు... వ్యూహాలను కూడా బాగా రచించగలడు. అందుకే ఐపీఎల్ (IPL) లో మోస్ట్ సక్సెస్ ఫుట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఇప్పుడు టీమిండియా తరఫున కూడా అనిపించుకునే పనిలో పడ్డాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్నింట్లోనూ క్లీన్ స్వీప్ మంత్రాన్ని జపిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే... తాను సారథ్యం చేస్తుంటే సిరీస్ క్లీన్ స్వీప్ కావాల్సిందే అనే ధోరణిలో రోహిత్ ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ను ఏకంగా ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన ఘనత రోహిత్ ది. ఈ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ వేటలో ముంబై ఫేవరెట్ గా కనిపిస్తోంది.

    అయితే ఈ సీజన్ ను ముంబై ఇండియన్స్ అంతగా ఘనంగా ప్రారంభించలేదు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ తమ ఆరంభ మ్యాచ్ ల్లో ఓడిపోవడం ఇదేమి కొత్త కాదు. ఓడిపోయిన ప్రతిసారీ పుంజుకోవడం ఆ జట్టుకు అలవాటే. ఇక, రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ కాసేపట్లో... కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొనేందుకు సిద్ధమైంది. . ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నాయకుడు రోహిత్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

    రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ (అంతర్జాతీయం, లీగ్ క్రికెట్ లను కలుపుకుని)లో 10 వేల పరుగుల మైలురాయికి కేవలం 54 పరుగుల దూరంలో నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు తన లో 371 మ్యాచ్ ల్లో 9,946 పరుగులు చేశాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ముంబై సారథి రోహిత్ మరో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకుంటాడు.

    టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసిన తొలి భారత ఆటగాడిగా అగ్రస్థానం ఉన్నాడు. రోహిత్ మరో 54 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండు భారత క్రికెటర్‌గా నిలుస్తాడు.మొత్తంగా చూసుకుంటే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో వెస్టిండీస్ వెటరన్ ప్లేయర్ క్రిస్ గేల్ అగ్ర స్థానంలో ఉన్నాడు.

    ఇది కూడా చదవండి : అయ్యో పాక్ కెప్టెన్ పరువు పాయె.. ఐపీఎల్ లో రూ.20 కోట్లు అన్నారు.. అక్కడ చిల్లిగవ్వ కూడా దక్కలేదు..

    యూనివర్సల్ బాస్ ఇప్పటివరకు 463 మ్యాచ్‌లు ఆడి..14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ రెండో స్థానంలో ఉన్నాడు. మాలిక్ 472 మ్యాచ్‌లు ఆడి.. 11698 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో విండీస్ పరిమిత ఓవర్ల సారథి కీరన్ పొలార్డ్ ఉన్నాడు. పోలీ 582 మ్యాచుల్లో 11,452 పరుగులు చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Rohit sharma, Shreyas Iyer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు