MI vs KKR : కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరుగుతోన్న మ్యాచ్ లో జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 5 వికెట్లతో రెచ్చిపోయాడు. తొలి స్పెల్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ ముంబై పేసర్ రెండో స్పెల్ లో మాత్రం కేకేఆర్ బ్యాటర్లను హడలెత్తించాడు. 18వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన బుమ్రా ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లు కూడా 156 స్కోరు మీదే పడటం విశేషం. ఒక దశలో 200 పరుగులు చేరుకునేలా కనిపించిన కేకేఆర్ ను తన బౌలింగ్ తో బుమ్రా అడ్డుకున్నాడు. దాంతో కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. బుమ్రా తన చివరి రెండు ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకోవడం విశేషం. కోల్ కతా బ్యాటర్స్ లో వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు.
ఆరంభం అదిరినా..
ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ జట్టు ఏకంగా ఐదు మార్పులు చేసింది. గత మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం అయిన వెంకటేశ్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు అదిరిపోయే షాట్లతో అదరగొట్టాడు. నితీశ్ రాణా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో కేకేఆర్ 200 పరుగుల మార్కును అలవోకగా దాటుతుందని అందరూ భావించారు. అయితే ఎప్పుడైతే బౌలింగ్ కు బుమ్రా వచ్చాడో అక్కడి నుంచి కోల్ కతా రాత మారిపోయింది. తొలుత ఆండ్రీ రస్సెల్ ను అవుట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత 18వ ఓవర్లో ఒక్క పరుగు కూడాఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. ఇక 20వ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. కుమార్ కార్తికేయ సింగ్ 2 వికెట్లు సాధించాడు.
తుది జట్లు
కోల్ కతా నైట్ రైడర్స్
వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రహానే, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ప్యాట్ కమిన్స్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, రమన్ దీప్ సింగ్, డేనియల్ స్యామ్స్, మురుగన్ అశ్విన్, జస్ ప్రీత్ బుమ్రా, రైలీ మెరిడిత్, కుమార్ కార్తికేయ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Jasprit Bumrah, Kieron pollard, Kolkata Knight Riders, Mumbai Indians, Pat cummins, Rohit sharma, Shreyas Iyer